మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు

Panchayat elections within three months

Panchayat elections within three months

Date:11/10/2018
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్‌  ముచ్చట్లు:
మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోకపోవడం, ఓటర్ల జాబితా సిద్ధం చేయకపోవడంపై న్యాయస్థానం తప్పుబట్టింది. పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల నియామకాన్ని సవాల్‌ చేస్తూ ఇటీవల కొందరు హైకోర్టును ఆశ్రయించారు. గడువు ముగిసిన పంచాయతీలకు ప్రభుత్వ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులను నియమించడం చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ కలిపి విచారించిన న్యాయస్థానం పిటిషనర్ల వాదనలతో ఏకీభవిస్తూ తీర్పు వెలువరించింది.పంచాయతీలకు మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించేంత వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుందని.. ఎన్నికల ప్రక్రియ వారి ద్వారానే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి అని.. వివిధ కారణాలతో వాటిని వాయిదా వేయడం మంచి పద్ధతి కాదని హైకోర్టు అభిప్రాయపడింది.
Tags:Panchayat elections within three months

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *