భారీ వర్షంలోను ఆగని పంచాయతీ సేవలు

Date:20/08/2020

వరంగల్  ముచ్చట్లు:

మహాదేవపూర్ మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షం లోను మహాదేవపూర్ గ్రామ పంచాయతీ సేవలు ఆగడం లేదు.గ్రామ పరిస్థితులపై సర్పంచ్ శ్రీపతి బాపు  నిరంతరం ఆరా తీస్తున్నారు. తనే స్వయంగా వీధుల్లో పర్యటిస్తూ  ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎడతెరపి లేని వర్షం కారణంగా రహదారుల పై పేరుకుపోయిన చెత్తా చెదారం, డ్రైనేజీల పక్కనే ఉన్న పురాతన ప్రహరీ గోడలు కూలి డ్రైనేజీ లో పడడంతో భారీగా వచ్చే వరద నీరుతో ప్రజలకు ఏలాంటి  ఇబ్బందులు కలగకుండా సర్పంచ్  ఆదేశాలతో  గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు వర్షం సైతం లెక్కచేయకుండా పారిశుద్ధ్య  పనులు చేపడుతున్నారు. మండల కేంద్రంలోని  బట్టి కొట్టు కాలనీ వాసులు మిషన్ భగీరథ నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో  వెంటనే   విషయం తెలుసుకున్న సర్పంచ్  గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్ పంపి కాలనీ వాసులు నీటి కష్టాలు తీర్చారు. వర్షం కారణంగా ఇండ్లు కూలిన,వరద బాధిత కుటుంబాలకు మహాదేవపూర్ తహశీల్దార్ ఆదేశాలతో  బాధితులకు ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్  వసతి కల్పించి
భోజన వసతి కల్పించారు.

 

 ఎస్ పి ఎం కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ వినతి పత్రం 

Tags:Panchayat services that do not stop during heavy rains

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *