పుంగనూరులో పెద్దిరెడ్డి రికార్డు…!

Pandireddy record in Punganuru

– ఏటా రెండు సార్లు పల్లెబాట
– రెండుసార్లు అయ్యప్పదీక్ష
– ఎవరితోనైనా మమేకం

 

Date:24/03/2019

పుంగనూరు ముచ్చట్లు:

జిల్లా రాజకీయాల్లో డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓ ఫైర్‌బ్రాండ్‌గా ముద్ర వేసుకుని పుంగనూరు రికార్డును బద్దలు కొట్టారు. రైతు కుటుంబం నుంచి రాజకీయ చదరంగంలో రారాజుగా మిగిలారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న పుంగనూరు నియోజకవర్గంలో పాగా వేసి , పుంగనూరు చరిత్రలో మంత్రి పదవిని దక్కించుకున్న తొలి ఎమ్మెల్యేగా హిస్టరీ సాధించి, 2019 ఎన్నికల్లో హ్యాట్రిక్‌ సాధించనున్నారు.

రామచంద్రుని జననం……

సదుం మండలం ఎర్రాతివారిపల్లెకు చెందిన పెద్దిరెడ్డి లకుఒరెడ్డి, పద్మావతమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. రామచంద్రారెడ్డి పెద్దవారు. బాస్కర్‌రెడ్డి, ద్వారకనాథరెడ్డి ఆయన సోదరులు. 1952జూలై 1వ తేది జన్మించిన రామచంద్రారెడ్డి ప్రాథమిక, ఉన్నత పాఠశాల చదువును సదుంలో పూర్తి చేశారు. 1969లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేసి 1970లో తిరుపతిలో పీయూసీలో చేరారు. 1974లో ఎస్వీయూనివర్శిటిలో పోస్టుగ్రాడ్యుయేషన్‌లో చేరడం రామచంద్రారెడ్డిని రాజకీయాలకు దగ్గర చేసింది. అప్పటి నుంచి ఆయన చూపు రాజకీయాలపై మళ్ళి 1974 – 1975 లో యూనివర్శిటి విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సమయంలోనే చంద్రబాబు నాయుడుకు వ్యతిరేక వర్గంగా ఆయన విద్యార్థి రాజకీయాలు నడిపారు. పోస్టు గ్రాడ్యుయేషన్‌ తర్వాత సదుంకు తిరిగి వెళ్ళినా ఆయనకు రాజకీయాలపై ఆసక్తి తగ్గలేదు. కొంత కాలం పాటు వ్యవసాయం చేయించిన ఆయన ప్రత్యేక్ష రాజకీయాల్లో పాల్గొన్నారు.

సంజీవరెడ్డి పరిచయమే………

రాష్ట్రంలో 1977 ప్రాంతంలో జరుగుతున్న రాజకీయాలను గమనించిన రామచంద్రారెడ్డి ఒక సారి నీలం సంజీవరెడ్డిని కలుసుకోవాలని అనుకున్నారు. సదుం నుంచి డిల్లీకి వెళ్ళి ఆయనతో కలసి మాట్లాడారు. ఆయన ప్రోత్సాహంతో జనతా పార్టీలో చేరి 1978లో పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్‌ అభ్యర్థి సైపుల్లాబేగ్‌కు ప్రత్యర్థిగా పోటీ చేసిన ఆయన 22,203 ఓట్లు పొందారు. అప్పటి దాకా ప్రత్యేక్ష రాజకీయాలతో సంబంధం లేని రామచంద్రారెడ్డి కుటుంబం ఆ ఎన్నికలతో నియోజకవర్గ ప్రజలకు పరిచయమైంది. 1980 లో చౌడేపల్లె సమితి అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓటమి చెందారు. తన సహ విద్యార్థి స్వర్ణలతను వివాహం చేసుకున్నారు. ఈమె రాయచోటి మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమార్తె. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రామచంద్రారెడ్డి 1989లో పార్టీ టికెట్‌ సాధించి టీడీపీ అభ్యర్థి చల్లారామచంద్రారెడ్డిపై విజయం సాధించారు. ఈ విజయం ఆయనను జిల్లా నాయకుడిగా తయారు చే సింది. అప్పటి నుంచి జిల్లా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. 1994 ఎన్నికల్లో పీలేరులో టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. 1999 ఎన్నికల్లో విజయం సాధించారు. తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ళ కాలం కాంగ్రెస్‌ కమిటి అధ్యక్షుడిగా పని చేసి పార్టీని కాపాడుకుంటు వచ్చారు. 2004లో మూడోసారి విజయం సాధించారు. ఢిల్లీస్థాయిలో పరిచయాలు ఏర్పరుచుకుని జిల్లాలో తిరుగులేని నాయకుడుగా ఆవిర్భవించారు. 2009 ఎన్నికల్లో పెద్దిరెడ్డి వచ్యీహాత్మకంగా వ్యవహరించి పుంగనూరు ఎమ్మెల్యేగా 40వేలకు పైగా మెజార్టీ ఓట్లు సాధించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ మంత్రి వర్గంలో అటవీశాఖ మంత్రిగా పుంగనూరులో తొలిసారి మంత్రిగా రికార్డు సృష్టించారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున పుంగనూరు నుంచి రెండవ సారి పోటీ చేసి, 32 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఏప్రిల్‌ 11న జరిగే ఎన్నికలలో మూడవ సారి హ్యాట్రిక్‌ సాధించే ందుకు సిద్దమై, నియోజకవర్గంతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలోను తన మద్దతుదారులతో కలసి పార్టీ అభ్యర్థుల విజయానికి వచ్యీహం పన్నారు. ప్రచారాన్ని తీవ్రతరం చేసి, అధికార పార్టీతో పాటు, అన్ని పార్టీల అభ్యర్థులకు మచ్చెమటలు పట్టిస్తున్నారు.

సేవా కార్యక్రమాలు…..

నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా పేరు సాధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతియేటా జనంతో రెండుసార్లు నేరుగా మమెకమౌతారు. ఇదే ఆయనకు చెప్పలేనంత బలం చేకూర్చి, బలమైన నాయకుడుగా నిలిచారు. తన వారి కోసం ఏమైనా చేసే వ్యక్తిగా పేరు సంపాదించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సోదరుడు దివంగత భాస్కర్‌రెడ్డి పేరు మీద భాస్కర్‌ట్రస్ట్ ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలకు అనేక సహయ కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ, అబినవ దానకర్ణుడుగా పేరుగాంచారు.

అయ్యప్పభక్తుడు…..

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయ్యప్పస్వామిని ఇష్టదైవంగా ప్రార్థిస్తారు. తన స్వగ్రామం ఎర్రాతివారిపల్లెలో శబరిమలై అయ్యప్ప స్వామి నమూనాను పొలిన ఆలయాన్ని అత్యంత సుందరంగా సుమారు రూ.10 కోట్లు ఖర్చు చేసి నిర్మించారు. ప్రతి సంవత్సరం అయ్యప్ప భక్తులకు ఇక్కడ అన్నదానం శబరిమలైకి పోవడానికి వీలులేని వారు ఇక్కడ వచ్చి ఉండేందుకు వసతి సముదాయాలు నిర్మించారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అయ్యప్పమాలను రెండు సార్లు వేసుకుని దీక్షలో ఉంటు తన భక్తిని చాటుకుంటారు.

భారతదేశంలో ప్రధాని నరేంద్రమోదీ తిరుగలేని శక్తి

Tags: Pandireddy record in Punganuru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *