Panganur Zamindarini Ranisundara's death

పుంగనూరు జమీందారిణి రాణిసుందర మ్మణ్ణి మృతి

– పలువురు సంతాపం

Date:04/04/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మాజీ ఎమ్మెల్యే జమీందారిణి రాణి సుందరమ్మణ్ణి (94) మృతి చెందారు. ఈమె మృతి వార్త తెలియడంతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. పట్ల పలువురు సంతాపం తెలిపారు. 5న పట్టణంలో జమీందారిణి భౌతికకాయాన్ని ఊరేగింపుగా నిర్వహిస్తారు. అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈమె మృతి పట్ల చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, కమిషనర్‌ కెఎల్‌.వర్మ, మాజీ మున్సిపల్‌ చైర్మన్లు కొండవీటి నాగభూషణం, షమీమ్‌షరీఫ్‌, మాజీ జెడ్పిటీసీ వెంకటరెడ్డి యాదవ్‌, ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి సంతాపం తెలిపారు. అలాగే కాపు సంఘ నాయకులు , న్యాయవాది రాయల జగదీష్‌కుమార్‌, పూలత్యాగరాజు, కెసిటిసి అధినేత ముత్యాలు, లయన్స్ క్లబ్ జిల్లా పీఆర్‌వో డాక్టర్‌ శివ, జమీందారుల సేవలను కొనియాడి , రాణిసుందరమ్మణ్ణి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలిపారు. అలాగే వైఎస్‌ఆర్‌సీపీ నేతలు నాగరాజారెడ్డి, ఆవుల అమరేంద్ర, మైనార్టీల నాయకులు ఖాదర్‌ఖాన్‌, ఫకృద్ధిన్‌షరీఫ్‌, అమ్ము, అర్షద్‌అలి, కిజర్‌ఖాన్‌, అయూబ్‌ఖాన్‌, ఇంతియాజ్‌లు సంతాపం తెలిపారు.

రేషన్‌కార్డు దారులకు డబ్బు పంపిణీ విజయవంతం

Tags: Panganur Zamindarini Ranisundara’s death

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *