పుంగనూరులోఆగస్టు 15 నుంచి జనగణమన ఇక నిరంతరం

Panganuru from August 15 is now continuous

Panganuru from August 15 is now continuous

Date:12/08/2018

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరులోఆగస్టు 15 నుంచి జనగణమన ఇక నిరంతరం
* మదనపల్లెలో గీత అనువాదం
* పుంగనూరుకు దేశస్థాయిలో రెండవ స్థానం
* తొలి స్థానం తెలంగాణ లోని జమ్మికుంట
*రెండవ స్థానం పుంగనూరు.

Panganuru from August 15 is now continuous
Panganuru from August 15 is now continuous

భారతదేశ చరిత్రలో పుంగనూరుకు రెండవ స్థానం లభించింది. ఎక్కడ లేని విధంగా పుంగనూరులో మన జాతీయగీతమైన జనగణమన గీతాన్ని స్వాతంత్య్ర దినోత్సవం రోజు నుంచి నిరంతరం కొనసాగించనున్నారు. ఈ మేరకు పట్టణంలోని జనగణమన కమిటి సభ్యులు పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌, పి.అయూబ్‌ఖాన్‌,సివి.శ్యామ్‌ప్రసాద్‌, వి.దీపక్‌, కె.రెడ్డిప్రసాద్‌లు ఏర్పాట్లు చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఆదివారం పట్టణంలోని ప్రారంభోత్సవం జరిగే మున్సిపల్‌ బస్టాండు, గోకుల్‌ సర్కిల్‌, కొత్తయిండ్లు, ఇందిరాసర్కిల్‌, ఎంబిటి రోడ్డు, తూర్పువెహోగశాల ప్రాంతాలలో 10 స్పీకర్లను ఏర్పాటు చేశారు. వీటిని నియంత్రణ కంట్రోల్‌ రూమును మున్సిపాలిటిలో ఏర్పాటు చేశారు. ప్రతి రోజు ఉదయం 7:59 నిమిషాలకు పోలీస్‌ సైరన్‌ ప్రారంభంతో ప్రజలను అప్రమత్తం చేస్తారు. 8 గంటలకు గీతాన్ని ప్రారంభిస్తారు. ఈ మేరకు పట్టణంలో కరపత్రాలను పంపిణీ చేసి, స్పీకర్ల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో ప్రజలందరిని భాగస్వామ్యులను చేసి, వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

జాతీయ గీతం అనువాదం మదనపల్లెలో…

మన జాతీయ గీతానికి పుట్టినిల్లు పశ్చిమ బెంగాల్‌, ఈ గీతాన్ని ఆంగ్లంలోకి అనువధించిన ప్రాంతం మదనపల్లె…. ఇప్పుడు ఈ గీతాన్ని నిరంతరం ఆలపించే ప్రాంతంగా పుంగనూరు చరిత్రకు ఎక్కనుంది. సాధారంగా మన జాతీయగీతం జనగణమనకు భారతపౌరులు ఎనలేని గౌరవాన్ని ఇస్తారు. అలాంటి ఈ గీతం విద్యాకేంద్రాలలో ప్రతి రోజు ఆలపించడం జరుగుతూ వస్తోంది. జాతీయ పర్వదినాలలో గీతాన్ని ఆలపించడం తప్పనిసరిగా జరుగుతుంది. అయితే ప్రతి రోజు ఒక నిర్ణీత వేళలో జాతీయ గీతాన్నివినిపించడం , అదే సమయంలో పౌరులంతా నిమిషం పాటు ఎక్కడి వారు అక్కడే ఉండి, గీతాన్ని ఆలపించి , గౌరవ వందనం చేసే కార్యక్రమానికి పుంగనూరు వేదికగా మారబోతోంది. స్వాతంత్రదినోత్సవం ఆగస్టు 15 నుంచి ఈ కార్యక్రమం చేపట్టేందుకు జనగణమన కమిటి నిర్ణయించింది.

జాతీయగీతం నేపధ్యం …

విశ్వకవీంద్రుడు రబింద్రనాథ్‌ఠాగూర్‌ మన దేశ జాతీయగీతం జనగణమనను వ్రాశారు. బెంగాలిబాషలో వ్రాసిన జాతీయ గీతాన్ని ఆంగ్లంలోకి అనువధించింది మన జిల్లాలోని మదనపల్లెలో. 1919 ఫిబ్రవరిలో ఆయన మదనపల్లెలో విడిది చేశారు. అప్పటి బిటి కళాశాల ప్రిన్సిపాల్‌ కజిన్స్ ఆహ్వానం మేరకు కొన్ని రోజులు పాటు మదనపల్లెలో ఉన్నారు. కళాశాల ప్రాంగణంలోని కాటేజిలో విడిది చేశారు. ఈ సందర్భంగా 1919 ఫిబ్రవరి 28న జనగణమన జాతీయ గీతాన్ని దమార్నింగ్‌ సాంగ్‌ ఆఫ్‌ ఇండియా పేరుతో ఆంగ్లబాషలోకి అనువధించారు. అనువాదం అనంతరం గీతాన్ని తొలిసారిగా బిటి కళాశాలలోనే ఆలపించారు. విద్యార్థులచేత గీతాన్ని ఆలపింపచేయగా ప్రిన్సిపాల్‌ కజిన్స్ భార్య మార్గెట్‌ కజిన్స్ జాతీయ గీతానికి బాణి చేకూర్చారు. ఈ గీతం అనువధించిన ఠాగూర్‌ , వ్రాసిన కాగితం చివరన ట్రాన్స్లెటెడ్‌ ఆట్‌ మదనపల్లె అని వ్రాసి సంతకం చేశారు. విశ్వకవి స్వదస్తూరితో వ్రాసిన ప్రతి ఇప్పటికి మదనపల్లె బిటి కళాశాల లెబ్రెరీలో ఉంది. బిటి కళాశాలను ఆయన సందర్శించడానికి కారణం ఉంది. ఐరిష్‌ వనిత అనిబిసెంట్‌ కళాశాలను స్థాపించగా ఆమె హ్గమ్‌రూల్‌ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దీనిని జీర్ణించుకోలేని బ్రిటిష్‌ ప్రభుత్వం కళాశాల గుర్తింపును రద్దు చేసింది. దీంతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన నేషనల్‌ యూనివర్శిటికి అనుబంధంగా బిటి కళాశాలకు గుర్తింపు ఇచ్చారు. అప్పట్లో విశ్వకవి రబింద్రుడు నేషనల్‌ యూనివర్శిటికి ఉపకులపతిగా ఉండేవారు. దాంతో బిటి కళాశాల ప్రిన్సిపాల్‌ తమ కళాశాలను సందర్శించాలని విన్నవించడం, ఆయన రావడం, విడిది సమయంలోనే జాతీయ గీతాన్ని ఆంగ్లంలోకి అనువధించడం జరిగింది. దేశ ప్రజలు అత్యుత్తమ గీతంగా గౌరవించే జనగణమన ఆంగ్ల అనువాదానికి మన జిల్లాలోని మదనపల్లె కేంద్రం కావడం చారిత్మ్రాత్మక గుర్తింపు దక్కింది.

యూనెస్కో గుర్తించింది…

మన జాతీయ గీతానికి అంతర్జాతీయ గుర్తింపు కూడ దక్కింది. 2008లో ఐక్యరాజ్యసమితిలో భాగమైన యూనెస్కో ప్రత్యేకంగా మన జాతీయ గీతాన్ని గుర్తించి ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగా మదనపల్లె సమీపంలోని పుంగనూరులో ఇటువంటి కార్యక్రమాన్ని తలపెట్టడం చరిత్ర సృష్టించింది. ప్రజలు ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నారు.

పుంగనూరులోఆగస్టు 15 నుంచి జనగణమన ఇక నిరంతరం

Tags:Panganuru from August 15 is now continuous

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *