Natyam ad

పలమనేరు వద్ద పంజాణి యువకుడు వినయ్ దారుణ హత్య

పలమనేరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా, పలమనేరు వద్ద యువకుడి హత్య కలకలం రేపు తోంది. పలమనేరు సమీపంలోని గాంధీనగర్ దగ్గర పెద్దపంజాణి మండలం శివాడికి చెందిన శివశంకర్ కొడుకు వినయ్ హత్యకు గురైనట్లు పోలీసులు సోమవారం గుర్తించారు. మృతదేహాన్ని పరిశీలించిన పలమనేరు పోలీసులు, పంచనామా అనంతరం ప్రభుత్వాసుపత్రి లోని మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. వినయ్ ని ఎవరైన హత్య చేసి ఉంటారన్న కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. పలమనేరు మండలంలోని గడ్డూరికి చెందిన ఓ మహిళ ఆమె ప్రియుడుతో కలిసి ఈ హత్య చేసినట్లు సమాచారం అధికారులు ఆదిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. సిఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Post Midle

Tags: Panjani youth Vinay brutally murdered at Palamaneru

Post Midle