పోన్నాల ..ఆయన కోడలా

Panna .. he is kodala

Panna .. he is kodala

Date:08/10/2018
కరీంనగర్  ముచ్చట్లు:
గత ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ పొన్నాల లక్ష్మయ్య హవా మామూలుగా సాగ లేదు. అంతకుముందు పదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన ఆయనకు కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దపీట వేసింది. ఏకంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మొదటి అధ్యక్షుడిని చేసింది. ఆయన నాయకత్వంలోనే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికలకు పోయింది. ఒకవేళ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే లక్ష్మయ్యకు ప్రభుత్వంలోనూ పెద్దపీటనే ఉండేదేమో. కానీ, సీన్ రివర్స్ అయ్యింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఓడిపోయింది. స్వంత నియోజకవర్గం జనగామలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో పోటీచేసిన పొన్నాల లక్ష్మయ్యనే స్వయంగా ఓడిపోయారు. దీంతో ఆయనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోయింది.
పీసీసీ అధ్యక్షుడి పదవి కూడా పోయింది. దీంతో ఆయన రాష్ట్ర స్థాయి రాజకీయాలకు దూరమయ్యారు.1989లో మొదటిసారి జనగామలో పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. తర్వాత 1999, 2004, 2009లో కూడా విజయం సాధించారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో పొన్నాలకు భారీ నీటి పారుదల శాఖ అప్పగించి ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో పొన్నాల పేరు బాగానే వినపడింది. గత ఎన్నికల్లోనూ జనగామలో పోటీచేసిన పొన్నాల టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేతిలో 32 వేల ఓట్ల భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు.
ఈ ఎన్నికల్లోనూ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఆయన ప్రచారం కూడా ప్రారంభించేశారు.ఇక పొన్నాల లక్ష్మయ్య లేదా ఆయన కోడలు పొన్నాల వైశాలి జనగామ నుంచి బరిలో ఉండనున్నారు. పొన్నాల మంత్రిగా ఉన్నప్పుడు కూడా వైశాలి నియోజకవర్గ రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉండేవారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేశారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేవారు. గత ఎన్నికల్లోనే ఆమె పోటీలో ఉంటారనుకున్నా మళ్లీ పొన్నాలే బరిలో ఉన్నారు. ఈ సారి కూడా పొన్నాల లక్ష్మయ్యనే బరిలో దిగుతారని తెలుస్తోంది.
ఇక గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తర్వాత టీఆర్ఎస్ లో చేరి ఈ ఎన్నికల్లో టిక్కెట్ ఆశించారు. ఆయనకు టిక్కెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా బరిలో నిలిచే అవకాశం ఉంది. ఇక తెలంగాణ జన సమితి కూడా ఇక్కడి నుంచి పోటీచేయాలని భావిస్తున్నా.. పొత్తు కారణంగా సీనియర్ నేత ఉన్న కాంగ్రెస్ కే ఈ స్థానం దక్కే అవకాశం ఉంది.మొత్తానికి నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టగ్ ఆఫ్ వార్ ఉండనుంది. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన వైఖరి అనేక వివాదాలకు తావిచ్చింది.
భూఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలూ వచ్చాయి. టీఆర్ఎస్ లోనూ కొంతమంది నేతలు ఆయన పట్ల అసంతృప్తితో ఉన్నారు. కానీ, అభివృద్ధి విషయంలో మాత్రం ఫర్వాలేదు అన్న పేరు తెచ్చుకున్నారు. ఇక జనగామ ప్రత్యేక జిల్లా కావడంతో ముత్తిరెడ్డికి బాగా కలిసి రానుంది. జిల్లా ఏర్పాటు కోసం ఇక్కడి ప్రజలు పెద్ద పోరాటం చేశారు. దీంతో ప్రభుత్వం చివరి నిమిషంలో జనగామను జిల్లాగా ప్రకటించింది. ఇక పొన్నాల కుటుంబానికి ఇక్కడ మంచి పేరే ఉంది. గ్రామగ్రామాన బలమైన క్యాడర్ ఉంది. ఒకవేళ ఆయన కోడలు బరిలో ఉంటే మరింత కలిసిరానుంది.
కొమ్మురి ప్రతాప్ రెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే చేర్యాల, బచ్చన్నపేట, మద్దూరు మండలాల్లో భారీగానే ఓట్లు సాధించే అవకాశం ఉన్నా గెలిచే స్థాయిలో ఉంటారని చెప్పలేం. ఆయన ఇంతకుముందు చేర్యాల ఎమ్మెల్యే పనిచేయడం కలిసివచ్చే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీకి సైతం జనగామ పట్టణంలో చెప్పుకోదగ్గ స్థాయిలో క్యాడర్ ఉంది. మొత్తానికి ప్రస్తుతానికైతే పొన్నాల – ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మధ్య గట్టి పోటీ ఉండనుంది.
Tags:Panna .. he is kodala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed