గంటాకు అనుంగు శిష్యుడే పంగనామాలా

Date:13/06/2019

విశాఖపట్టణం ముచ్చట్లు:

ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నది సామెత. రాజకీయాల్లో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇపుడు వైసీపీ ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. నిన్నటి వరకూ విశాఖ రాజుగా ఏలిన గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి అయిపోయారు. ఆయన సహచరుడే ఇపుడు విశాఖ వైసీపీకి కొత్త పెత్తందారు. ఆయన్ని ఏరి కోరి పార్టీలోకి తీసుకున్న జగన్ ఇపుడు విశాఖ సిటీ రాజకీయాన్ని ఒడిసిపట్టాలనుకుంటున్నారు. అందుకు అవంతినే ప్రయోగిస్తున్నారు. అవంతి పదేళ్ళ పాటు గంటా అనుచరుడు. ఆయన గుట్టు మట్లు పూర్తిగా తెలిసిన వాడు. మంత్రి పదవి కోసం ఆయన వైసీపీ వైపు ఫిరాయించారు. జగన్ సైతం పట్టున్న నేత దొరికారని ఆయన్ని అక్కున చేర్చుకున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగాయి. ఏపీలో జగన్ సర్కార్ ఏర్పడింది.మాజీ మంత్రి గంటా అనుచరవర్గం మూడేళ్ళ క్రితం విశాఖ జిల్లాలో భూ కబ్జాలకు పాల్పడ్డారన్న దానిపై అప్పట్లో ప్రతిపక్షాలు రోడ్డెక్కాయి. చాలా కాలం పాటు ఆందోళనను నిర్వహించాయి. వైసీపీ అధినేత జగన్ ప్రతిపక్ష హోదాలో విశాఖ నగరంలో స్వయంగా ధర్నా చేపట్టారు.

 

 

 

 

 

అప్పట్లో ఈ అంశం ఏపీలో రచ్చ రచ్చ అయింది. దాంతో చంద్రబాబు సర్కార్ దాని మీద ప్రత్యేక విచారణ కమిటి (సిట్) ని వేసి చేతులు దులుపుకుంది. సిట్ కి మూడు వేలకు పైగా ఫిర్యాదుకు వచ్చినా కూడా కేవలం మూడు వందలు మాత్రమే విచారించి సిట్ నివేదిక ఇచ్చేసింది. ఆ నివేదికలో ఏముందో కూడా బయటపెట్టకుండా చాన్నాళ్ళు దాచిన బాబు సర్కార్ చివరికి క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఇపుడు మళ్ళీ దాన్ని తవ్వితీయాలని జగన్ సర్కార్ పట్టుదలగా ఉంది.అదే జరిగితే మాజీ మంత్రికి, ఆయన అనుచరులకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ప్రభుత్వ భూములు, ఇతర అసైన్డ్ భూములు కూడా కబ్జా చేసేసి అక్రమాలకు పాల్పడిన ఆధారాలు ఉన్నాయి. అలాగే ఆ భూములపైన ఏకంగా గంటా చుట్టం పరుచూరి భాస్కరరావు బ్యాంకులకు వెళ్ళి మరీ తనఖా పెట్టేసి పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇపుడు ఇవన్నీ వెలుగు చూస్తే చాలా మంది తమ్ముళ్ళకు ఎక్కడ లేని చిక్కులు తప్పవు. ఇక ఈ విషయంలో పంతంగా ఉన్న వైసీపీ నాయకులు సమగ్ర దర్యాప్తు కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇక మంత్రిగా ప్రమాణం చేసి విశాఖ వచ్చిన అవంతి గంటా మీద చేసిన షాకింగ్ కామెంట్స్ విశాఖలో సరికొత్త రాజకీయ యుధ్ధం మొదలవుతుందన్న సంకేతాలు ఇచ్చేశారు . తొందరలోనే దీనికి సంబంధించిన కీలక ప్రకటన ఉంటుందని అంటున్నారు.

చిత్తూరు ఎంపి రెడ్డెప్పకు న్యాయవాదులచే సన్మానం

 

Tags: Pantanamalala, anchor of the hour

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *