పాపన్న కుంటలో పడి మహిళ మృతి

Date:04/09/2020

కామారెడ్డి ముచ్చట్లు:

కామారెడ్డి జిల్లా బిక్కనూర్  మండల కేంద్రానికి చెందిన గంధం  సిద్ధవ్వ (55) అనే మహిళ శుక్రవారం తెల్లవారు జామున మండల కేంద్రం శివారులో ఉన్న పాపన్న కుంట చెరువులో పడి మృతి చెందింది. గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం తెల్లవారు జామున ఇంటినుండి వెళ్ళిన మహిళ తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు వెతకగా పాపన్న కుంట చెరువు లో శవం కనిపించింది. దీంతో స్థానికులు, మృతురాలి భర్త బాలయ్య పోలీసులకు సమాచారం అందించారు. కాగా మృతురాలి ప్రమాదవశాత్తు చనిపోయిందా, లేక ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

బార్డర్లల్లో మధ్యం వ్యాపారం జోరు

Tags: Papanna fell into a ditch and killed a woman

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *