ప్లేట్ లెట్ పెరగాలంటే  బొప్పాయిని తినాల్సిందే

అమరావతి ముచ్చట్లు:

 

బొప్పాయి.. ఎన్నో సుగుణాలు ఉన్న గొప్ప పండు. దీంట్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బొప్పాయిని నిత్యం తింటే.. ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. అలాగే.. ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గిన వాళ్లు.. బొప్పాయిని నిత్యం తీసుకుంటే.. వెంటనే కౌంట్ పెరుగుతుంది. భవిష్యత్తులో ప్లేట్ లెట్ కౌంట్ తగ్గకుండా చూసుకోవాలనుకుంటే.. నిత్యం బొప్పాయిని తీసుకోండి. బొప్పాయి ఆకులను కూడా తినొచ్చు. వాటిని తీసుకున్నా కూడా ప్లేట్ లెట్స్ కౌంట్ పెరుగుతుంది. బొప్పాయి ఆకులను ఉడకబెట్టి.. వాటి రసాన్ని తీసి తేనే తో ఆ తర్వాత ఆకులను తింటే.. ప్లేట్ లెట్స్ కౌంట్ వద్దన్నా పెరుగుతుంది.ప్లేట్ లెట్స్ కౌంట్ పెరగాలంటే.. దానిమ్మను తినాల్సిందే. దానిమ్మ పండు గింజలను తిన్నా రసం కూడా రక్తం వృద్ధి చెందుతుంది. అలాగే.. ప్లేట్ లెట్స్ కౌంట్ పెరుగుతుంది. ఒకవేళ గింజలను తినడం ఇష్టం లేని వాళ్లు.. దానిమ్మ జ్యూస్ చేసుకొని తాగొచ్చు. ఎలా చేసినా.. ప్లేట్ లెట్స్ కౌంట్ మాత్రం పెరుగుతుంది.

 

గుమ్మడి కాయలో కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. గుమ్మడికాయను జ్యూస్ లా చేసి కూడా తాగొచ్చు. లేదంటే. గుమ్మడికాయను మెత్తగా పేస్ట్ లా చేసి.. ఆ పేస్ట్ నుంచి రసాన్ని తీసి ఆ రసంలో కాసింత తేనె వేసుకొని తాగాలి. అలా చేస్తే.. ప్లేట్ లెట్స్ కౌంట్ పెరుగుతుంది. గోధుమ గడ్డి జ్యూస్ తాగినా కూడా ప్లేట్ లెట్స్ కౌంట్ పెంచుకోవచ్చు. గోధుమ గడ్డి జ్యూస్ లో కాసింత తేనె కలిపి.. తాగండి. ప్లేట్ లెట్స్ కౌంట్ పెరుగుతుంది.

 

Tags:Papaya should be eaten to increase platelets

Leave A Reply

Your email address will not be published.