కంటోన్మెంట్‌ జోన్‌గా కాగతి

చౌడేపల్లె ముచ్చట్లు:

 

మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్‌ కేసులు ఉదృతి కొనసాగుతోంది. కాగతి లో అధిక కేసులు నమోదు కావడంతో బుధవారం కంటోన్మెంట్‌  జోన్‌గా   ప్రకటించినట్లు  ఎంపీడీఓ వెంకటరత్నం తెలిపారు. గ్రామంలో హైపోక్లోరైడ్‌ ద్రావణంను పిచికారి చేశారు.  ఆయన మాట్లాడుతూ కోవిడ్‌ కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉంటూ  జాగ్రత్తలు పాటించాలని సూచించారు.అలాగే దిగువపల్లె,  వెంగళపల్లె, కొండామర్రి పంచాయతీలలో పర్యటించి పారిశుధ్య పనులు   చేసేలా చర్యలు తీసుకొన్నారు. కోవిడ్‌ తో హో మ్‌ ఐసోలేషన్‌లో ఉన్న రోగులతో మాట్లాడి వారికి  ఆరోగ్య పరిస్థితి తెలుసుకొన్నారు. ఆయన వెంట ఈఓపిఆర్డీ మహమ్మద్‌ ఆజాద్‌ తదితరులున్నారు.

 

బీజీపీ వైపు ఈటెల అడుగులు

 

Tags; Paper as cantonment zone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *