జడ్పీ చైర్మన్ గా పాపిరెడ్డి ఎన్నిక
కర్నూలు ముచ్చట్లు:
కర్నూలు జిల్లా జడ్పీ చైర్మన్ గా ఎర్రబోతుల పాపిరెడ్డి ఎన్నికయ్యారు. మంగళవారం నాడు జడ్పీ ఎన్నిక కోసం సమావేశం నిర్వహించారు. పాపిరెడ్డి పేరును మహానంది జడ్పిటిసి సభ్యుడు కె ఆర్ మహేశ్వర్ రెడ్డి ప్రతిపాదించగా, మిడ్తూరు జడ్పీటీసీ సభ్యుడు పి.యుగంధర్ రెడ్డి, వెల్దుర్తి జడ్పిటిసి సుంకన్న లు బలపరిచారు. జడ్పీ చైర్మన్ గా ఎర్రబోతుల పాపిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు ప్రకటించారు. ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డిచే అయన ప్రమాణ స్వీకారం చేయించారు. ధృవీకరణ పత్రాన్ని అందజేసారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ , ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి , ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ల్, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి , ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బ్రిజేంద్ర నాథ్ రెడ్డి , పత్తికొండ ఎమ్మెల్యే కె శ్రీదేవి , మరియు జడ్పీటీసీ సభ్యులు, కోఆప్టెడ్ సభ్యులు హజరయ్యారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Papireddy elected Zadpi chairman