తితిదే ఉద్యోగులకు పరకామణి విధులు వేయకూడదు

Parakamani should not be obliged to perform abusive employees

Parakamani should not be obliged to perform abusive employees

మూడేళ్లు దాటి తిరుమలలో పనిచేస్తున్నవారిని తిరుపతికి బదిలీ
తితిదే పాలక మండలి పలు కీలక నిర్ణయాలు
Date:09/10/2018
తిరుమల  ముచ్చట్లు:
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి భేటీ ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తితిదే ఉద్యోగులకు పరకామణి విధులు వేయకూడదని, మూడేళ్లు దాటి తిరుమలలో పనిచేస్తున్నవారిని తిరుపతికి బదిలీ చేయాలని నిర్ణయించారు. తితిదే ఉద్యోగులు ఆగస్టు మాసంలో కొన్ని సమస్యలు పరిష్కరించాలని తితిదే పాలకమండలికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అప్పట్లోనే తితిదే ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఈవో అనిల్‌ సింఘాల్‌ ఉద్యోగులతో చర్చించారు. దీంతో వారి సమస్యలన్నీ చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన బోర్డు సమావేశంలో కార్మికులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలోని వసతిగృహాల ఆధునీకరణ, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు తితిదే బోర్డు ఎఫ్‌ఎంఎస్‌ సబ్‌ కమిటీ చేసిన సిఫార్సులను ఆమోదించింది.
ఇందుకు రూ.112 కోట్లు ఖర్చు కానుంది. తితిదేలోని రెగ్యులర్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వృత్తిపరంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఒక కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.- తితిదే విద్యాసంస్థల్లోని బోధనా సిబ్బందికి పదవీ విరమణ లేదా మరణించిన సందర్భాలలో ఆర్జిత సెలవు మరియు అర్ధ వేతన సెలవుల నగదు మార్పిడికి సంబంధించి జీవో నం. 90 అమలుచేసేందుకు నిర్ణయం. తితిదే ఆధ్వర్యంలోని జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ఆదరణ ఎక్కువగా ఉన్న గ్రూపులలో సీట్ల సంఖ్యను పెంచేందుకు, ఆదరణ తక్కువగా ఉన్న గ్రూపులలో సీట్ల సంఖ్యను తగ్గించేందుకు ఆమోదం.
తితిదే సిబ్బంది విజ్ఞప్తి మేరకు వారికి పరకామణి డిప్యూటేషన్‌ విధులను రద్దు చేసేందుకు ఆమోదం. ఫారిన్‌ సర్వీసు నుండి తితిదేకి వచ్చిన ఉద్యోగులను 3 సంవత్సరాల కాలపరిమితి అయిన తరువాత మాతృ సంస్థకు బదిలీ చేయాలని నిర్ణయం. ఒకసారి వచ్చిన వారిని రెండోసారి విధుల్లోకి తీసుకోరాదని నిర్ణయం. ఒకేచోట మూడు సంవత్సరాలు విధులు నిర్వహించిన తితిదే ఉద్యోగులను మరో విభాగానికి బదిలీ చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం నవంబరు 1 నుంచి అమల్లోకి వస్తుంది.- అలిపిరి వద్ద భక్తుల సౌకర్యార్థం మొదటి దశలో రూ.120 కోట్లతో దాదాపు 500 గదులతో వసతి సముదాయం నిర్మించేందుకు సమావేశంఆమోదం తెలిపింది.
Tags:Parakamani should not be obliged to perform abusive employees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *