పురుషామృగ వాహనంపై పరమేశ్వరుడి అభయం

Date:22/02/2020

తిరుప‌తి ముచ్చట్లు:

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ‌నివారం ఉదయం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారు పురుషామృగ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌, వినాయకనగర్‌ ఎల్‌ టైప్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ ఆలయం, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు ఆకట్టుకున్నాయి.

తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహించారు. ఉదయం 5.00 గంటలకు సుప్రభాతం, అనంతరం అభిషేకం చేశారు. వాహనసేవ తరువాత ఉదయం 9.30 నుండి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు.

సాయంత్రం 5 గంటలకు శివపార్వతుల కల్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా జ‌రుగ‌నుంది. ఆనంతరం రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు తిరుచ్చిపై స్వామివారు పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో   సుబ్రమణ్యం, ప్ర‌ధానార్చ‌కులు   మ‌ణిస్వామి, సూపరింటెండెంట్‌   భూప‌తిరాజు, ఎవిఎస్వో   నందీశ్వ‌ర‌రావు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు  రెడ్డిశేఖ‌ర్‌,  శ్రీ‌నివాస్‌నాయ‌క్ ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 23న త్రిశూలస్నానం :

బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన ఫిబ్రవరి 23వ తేదీన త్రిశూలస్నానం వైభవంగా జరుగనుంది. ఉదయం 7 నుండి 9 గంటల వరకు శ్రీ నటరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై దర్శనమివ్వనున్నారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు త్రిశూలస్నానం ఘట్టం శాస్త్రోక్తంగా జరుగనుంది. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంట‌ల వ‌ర‌కు ధ్వ‌జావ‌రోహ‌ణం నిర్వ‌హిస్తారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు రావణాసుర వాహనసేవ జరుగనుంది.

వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం 

Tags:Parameswara’s protection on a male vehicle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *