మాతృ వందన వారోత్సవాలు

Parent Thanksgiving Weekends

Parent Thanksgiving Weekends

Date:02/12/2019

తంబళ్లపల్లి ముచ్చట్లు:

ప్రధానమంత్రి మాతృ వందన పథకం ద్వారా మొదటిసారి గర్భం దాల్చిన మహిళలకు విడతల వారి 6000వేల రూపాయలు లబ్ధి చేకూరుతుందని ఆరోగ్య సూపర్ వైజర్ ధనమ్మ తెలిపారు. సోమవారం మండలంలోని బుదలవారి పల్లి ఆరోగ్యం ఉప కేంద్రం లో మాతృ వందన వారోత్సవాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో మొదటిసారి గర్భం దాల్చిన గర్భవతులను గుర్తించి ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, నమోదు చేయాలన్నారు. గర్భవతిగా నమోదైన వారికి 1000 రూపాయలు ఇస్తారన్నారు. రెండో విడత గర్భ ధారణ పరీక్ష పూర్తయిన వెంటనే 2000వేల రూపాయలు, డెలివరీ సమయంలో ఏ.ఎస్. వై పథకం మరో 1000రూపాయలు అందజేస్తారన్నారు. పుట్టిన బిడ్డకు క్రమం తప్పకుండా టీకాల కార్యక్రమం పూర్తి చేస్తే మరో 2000 రూపాయలు నాలుగు విడత లోనూ మొత్తం 6000 వేల రూపాయలు ప్రభుత్వం నుండి పొందవచ్చన్నారు.ఈ విషయాలను గ్రామంలో మహిళలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎమ్ సుభాషిని, హెల్త్ అసిస్టెంట్ లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

 

వైయస్సార్ నవశకం సమగ్ర సర్వే పూర్తి చేయాలి

 

Tags:Parent Thanksgiving Weekends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *