రామసముద్రం సింగిల్ విండో అధ్యక్షుడికి మాతృ వియోగం

రామసముద్రం ముచ్చట్లు:
 
రామసముద్రం సింగిల్ విండో అధ్యక్షుడు కొత్తూరు కేశవరెడ్డి తల్లి పార్వతమ్మ(80) బుధవారం మృతి చెందారు. పార్వతమ్మకు గత రెండు నెలల నుంచి అనారోగ్యానికి గురికావడంతో బెంగళూరు తదితర ప్రాంతాల్లో చికిత్సలు చేయించారు. బుధవారం పార్వతమ్మ తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా, తంబల్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిలు ఫోన్లో పరామర్శించారు. స్థానిక ఎంపీపీ కుసుమకుమారి సుందరం, జడ్పీటీసీ సిహెచ్.రామచంద్రారెడ్డి, మండల కన్వీనర్ భాస్కర్ గౌడు తదితర సర్పంచులు, ఎంపీటీసీలు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అలాగే పుంగనూరు ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి, ముడా చైర్మన్ నల్లబాల వెంకటరెడ్డి యాదవ్, ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి తదితర వైకాపా నాయకులు బౌతికాయన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
 
Tags: Parental divorce for Ramasamudram single window president

Leave A Reply

Your email address will not be published.