తల్లిదండ్రుల ప్రోత్సాహం అభినందనీయం

– రాష్ట్ర థాయ్ బాక్సింగ్ అసోసియేషన్ చైర్మన్ బీసీ ఇంద్రా రెడ్డి

Date:02/12/2020

కర్నూల్ ముచ్చట్లు:

తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడా సాధనకు ప్రోత్సహించడం అభినందనీయమని రాష్ట్ర
థాయ్ బాక్సింగ్ అసోసియేషన్ చైర్మన్ బీసీ ఇందిరా రెడ్డి అన్నారు.బుధవారం స్థానిక వెంకటరమణ కాలనీ లోని జె అండ్ కె బాక్సింగ్ అకాడమీ లో జరిగిన జిల్లా స్థాయి థాయ్ బాక్సింగ్ ఎంపిక పోటీలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా ఒలంపిక్ సంఘం కార్యదర్శి బి. రామాంజనేయులు మాట్లాడుతూ క్రీడాకారులు నిత్యం క్రీడల్లో సాధన చేయడం ద్వారా ఆరోగ్యం తో క్రమశిక్షణ అలవడుతుంది అని అన్నారు. క్రీడల్లో పాల్గొని వచ్చే ప్రశంసా పత్రాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలకుఉపయోగపడతాయని విద్యార్థులకు సూచించారు. అంతకుముందు క్రీడాకారుల కోసం 20 వేల రూపాయల విలువగల బాక్సింగ్ కిట్లను క్రీడాకారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా యోగా  కార్యదర్శి అవినాష్ శెట్టి , కెఎన్ఆర్ పాఠశాల కరస్పాండెంట్ గోపీనాథ్, పోటీల నిర్వాహక కార్యదర్శి జగదీష్ కుమార్,థాయ్ బాక్సింగ్ శిక్షకులు సూరి, తదితరులు పాల్గొన్నారు.

 ఫైజర్ టీకా రెడీ

Tags: Parental encouragement is commendable

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *