Natyam ad

ది కేరళ స్టోరీ సినిమాతో తల్లితండ్రులు జాగ్రత్త పడాలి-జన జాగరణ సమితి

విశాఖపట్నం ముచ్చట్లు:

ది కేరళ స్టోరీ సినిమాని మానవత్వం, మతోన్మాదానికి సంబంధించిన చిత్రం గా భావించాలని జన జాగరణ సమితి సూచించింది. తల్లిదండ్రులు ఈ చిత్రా న్ని చూసి, తమ పిల్లలు లవ్ జిహాద బారిన పడకుండా జాగ్రత్త పడాలనీ కోరారు. విశాఖ నగరంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జనజాగరన సమితి ప్రతినీదీ వాసు మాట్లాడారు. కేరళ స్టోరీ చిత్రంలో చూపించిన నిజాలను కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక కొన్ని రాష్ట్రాలలో సినిమాని బ్యాన్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ విషయంపై నిజ నిజాలు తేల్చేందుకు తాము చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. అదేవిధంగా ఇస్లామి క్ పేరుతో మతమార్పిడులకు పాల్ప డుతున్న సంస్థలను కనిపెట్టి వారిని శిక్షించి, కేరళ రాష్ట్రాన్ని ఎన్ఐఏ ఆధీనం లోకి తీసుకోవాలని సమితి డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

 

Tags: Parents should be careful with the movie The Kerala Story – Jana Jagarana Samithi