కన్నబిడ్డను అమ్ముకున్న తల్లిదండ్రులు

Date:30/10/2020

హైదరాబాద్  ముచ్చట్లు:

కన్న బిడ్డను  పోషించలేక  అమ్ముకున్న తల్లి  దండ్రుల ఉదంతం వెలుగులోకి వచ్చిరంది. రాచకోండ కమిషనరేట్ నాచారం పోలీసు స్టేషన్  పరిధిలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా నివాసముంటున్న   మీనా, వెంకటేష్ లకు జులై లో  19 న మగ బిడ్డ పుట్టాడు.  అప్పుడే  మధ్యవర్తి  ద్వారా వేరొకరికి అమ్మివేసారు. కాప్రా సర్కిల్ లో సూపర్ వైజర్ పనిచేస్తున్న రాజేష్ అనే వ్యక్తి తన భార్య గా బాధితురాలు మీనాను ఈఎస్సై  హాస్పిటల్ లో డెలివరి చేయించి,  అప్పుడే పుట్టిన బిడ్డను తీసుకున్నాడు.  ఐదు నెలల తరువాత తన బిడ్డను తనకు ఇవ్వాలని తల్లి  పోలీసులను ఆశ్రయించింది. నాకు పుట్టింది ఆడపిల్ల అనిచెప్పి, మోసం చేసి మగబిడ్డను మధ్యవర్తి అమ్మేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు  బాబును  చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు.

తంటికొండ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Tags: Parents who sold the child

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *