Natyam ad

రాప్తాడులో పరిటాల సునీత పాదయాత్ర

అనంతపురం ముచ్చట్లు:


అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టిన టీడీపీ నాయకురాలు పరిటాల సునీత, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి టార్గెట్గా హాట్ కామెంట్స్ చేశారు. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ‘ప్రకాష్రెడ్డీ జాగ్రత్తగా ఉండూ’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. రైతుల కోసం తెలుగుదేశం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు పరిటాల సునీత. ఇప్పటికే కనగానపల్లి, రామగిరి మండలాల్లో పాదయాత్రను కంప్లీట్ చేసుకుని, ఇప్పుడు రాప్తాడు మండలంలో పర్యటిస్తున్నారు. అయితే, పాదయాత్ర చేస్తోన్న తమను అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు సునీత. ఎక్కడికక్కడ చెక్పోస్టులు పెట్టి రైతులను నిర్బంధిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డి సూచనతోనే పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు సునీత. త్వరలోనే ప్రకాష్రెడ్డి బండారం మొత్తం బయటపెడతానంటోన్న పరిటాల సునీత.. రాప్తాడులో జరుగుతోన్న అక్రమాలు సీఎం జగన్కు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు.జాకీ పరిశ్రమకు కేటాయించిన భూములను తిరిగి రైతులకు అప్పగించే దమ్ము ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఉందా అని ఈ సందర్భంగా సవాల్ విసిరారు పరిటాల సునీత. రైతుల కోసం మొసలి కన్నీరు కార్చే ప్రకాష్ రెడ్డి.. అన్నదాతలకు చేసిందేమీ లేదన్నారు. పోలీసులను అడ్డంపెట్టుకుని తన పాదయాత్ర కార్యక్రమాలకు ఆటంకాలు కలగజేస్తున్నారని ఆరోపించారు. ఏదేమైనా రైతుల కోసం పాదయాత్రను విజయవంతం చేస్తానని.. అవసరమైతే రైతుల కోసం జైలుకు వెళ్లేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారామె.

 

Tags: Paritala Sunitha Padayatra in Raptadu

Post Midle
Post Midle