పార్కింగ్ వివరాలు ఇవ్వాలి :రేవంత్ రెడ్డి 

Parking details should be given: Revant Reddy

Parking details should be given: Revant Reddy

Date:25/08//2018
హైదరాబాద్ ముచ్చట్లు:
తెరాస తలపెట్టిన కొంగర కలాన్ సభ కు 25 లక్షల మందిని తరలించాలంటే 2.50 లక్షల వాహనాలు కావాలి, కనీసం నియోజకవర్గానికి 25వేల మందిని తరలించాలి. కొంగర కలాన్ సభకు రెండున్నర లక్షల మందికి మించి జనసమీకరణ చేయలేరు.  రెండున్నర లక్షల వాహనాలు పార్కింగ్ చేయాలంటే పార్కింగ్ ఎక్కడ చూపిస్తారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు.
పార్కింగ్ టెక్నీకల్ వివరాలు విడుదల చేయాలి. సభకు ప్రజలను తరలించేందుకు ఒక్కో వాహనానికి సరాసరి కనీసం ఐదు వేల రూపాయల ఖర్చు అవుతుంది.  25 లక్షల మందిని సభకు తరలించాలంటే 4వందల నుంచి 5వందల కోట్లు ఖర్చవుతుంది. గ్రామాల్లో మొఖం చెల్లక హైదరాబాద్ లో సభ పెడుతున్నారని అయన ఆరోపించారు.
నిన్న పంపిణీ చేసిన డబ్బాల్లో ప్రచార సామాగ్రి లేదు…డబ్బులు పెట్టి పంపిణీ చేశారు. ఒక్కో డబ్బాలో కోటి రూపాయలు పెట్టి పంపిణీచేశారు. ఇంత జరుగుతుంటే నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయని అయన అన్నారు. విచారణ సంస్థలు తక్షణమే ఈ సొమ్ము పై విచారణ చేయాలి. గన్ మెన్ లతో డబ్బాలు మోయించినందుకు ఆ ప్రజాప్రతినిధుల పై కేసులు పెట్టాలి.
మా అధిష్టానం ఢిల్లీలో ఉంది. కెసిఆర్ అధిష్టానం మోడీ కూడా ఢిల్లీలోనే ఉంది. టి.ఆర్.ఎస్ బీజేపీకి అనుబంధ శాఖగా కొనసాగుతుందని విమర్శించారు. సహాని వ్రుత్తి ప్రవృత్తి ఏంటో తెలియదా…?  కెసిఆర్ తరపున సహాని ఏ చర్యలకు పాల్పడుతున్నారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెంపర్లాడుతున్నారని అన్నారు. ఇవాళ తెరాస పరిస్థితి కొత్తోళ్ళకు టికెట్లు ఇస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడగొడతారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తే ప్రజలు ఓడగొడతారు అన్నట్టు వుందని అయన అన్నారు.
Tags:Parking details should be given: Revant Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *