వాయిదాలతో పార్లమెంట్ ప్రారంభం
న్యూఢిల్లీ ముచ్చట్లు:
తొలిరేజే ఎగువసభ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ధరల పెరుగుదల, జీఎస్టీ రేట్ల పెంపుపై కాంగ్రెస్ ఎంపీల ఆందోళనల నడుమ, రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఈనేపథం్యంలో.. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజే సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. అయితే.. అంతకుముందు, కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, రాజీవ్ శుక్లా, మీసా భారతి, ప్రఫుల్ పటేల్, హర్భజన్‌సింగ్, విజయేంద్రప్రసాద్ ప్రమాణస్వీకారం చేశారు.ఆ తర్వాత, ఎగువసభ ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు మాట్లాడుతుండగా వెల్‌లోకి కాంగ్రెస్ సభ్యులు దూసుకెళ్లారు. ఈనేపథ్యంలో.. కొందరు కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారని.. అలాగే రాష్ట్రపతి ఎన్నికలోనూ ఓటేసేందుకు వీలుగా సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు వెంకయ్య. నేడు (సోమవారం) సభ ప్రారంభమైన తర్వాత, జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, యూఏఈ మాజీ అధ్యక్షుడు షేక్ ఖలీఫాకు నివాళి అర్పించారు ఎంపీలు. అయితే..లోక్‌సభ కూడా ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. దీంతో.. స్పీకర్ ఓం బిర్లా ఎంపీలు రాష్ట్రపతి ఎన్నికల్లో భాగస్వామ్యం అయ్యేలా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు .
లోకసభలో వరదల రచ్చ
లోక్ సభకు తెలంగాణ వరదల రచ్చ తాకింది. కొద్దిరోజులుగా కురుస్తున్న కుండపోతు వానలు తెలంగాణ రాష్ట్రం అతలాకుతలమైంది. దీంతో.. గోదావరి మహోగ్రంగా ఉప్పొంగడంతో గోదావరి తీరం అల్లకల్లోలమైంది. తెలుగురాష్ట్రాల్లో వందలాది గ్రామాలను గోదావరి వరద ముంచెత్తడంతో.. వేలాది మంది ఇళ్లు వదిలి పునరావాసకేంద్రాలకు వెళ్లిపోయారు. అయితే.. వరద మేనేజ్ మెంట్ లో తెలంగాణ సర్కార్ విఫలమైందనే ఆరోపణలు విపక్షాల నుంచి వస్తున్నాయి. ఈనేపథ్యంలో.. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదని, జాతీయ రాజకీయాలంటూ సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్, బీజేపీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ వరదల రచ్చ పార్లమెంట్ ను తాకింది. రాష్ట్రంలో వరదలపై లోక్ సభలో మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. రాష్ట్రంలో.. గత 100 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విపరీతమైన వరద వచ్చాయని, జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కావున దీనిపై వెంటనే సభలో చర్చించాలని తీర్మానంలో కోరారు రేవంత్ రెడ్డి. అంతేకాకుండా.. వరదలతో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని, వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసం అయ్యాయని, 11 లక్షల ఎకరాలకు పైగా సాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయని తన తీర్మానంలో వివరించారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో.. వానల పరిస్థితి జాతీయ విపత్తుగా ప్రకటించి 2 వేల కోట్ల రూపాయల తక్షణ సహాయ ప్యాకేజీ ఇవ్వాలని రేవంత్ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మౌలిక సదుపాయాల నష్టాలను సరిచేయడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలన్నారు. వరదల విధ్వంసంతో నష్టపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
అబేకు పార్లమెంట్ నివాళి
ఇటీవల దారుణ హత్యకు గురైన జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు ఇవాళ పార్లమెంట్ నివాళి అర్పించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. జపాన్ మాజీ ప్రధాని మృతి పట్ల సంతాపం తెలిపారు. జూలై 8వ తేదీన జపాన్‌లోని నారా పట్టణంలో ఎన్నిక ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఓ ఆగంతకుడు అబేపై తుపాకీతో కాల్పులు జరిపారు. గతంలో భారత పార్లమెంట్లో అబే ఇచ్చిన సందేశాన్ని స్పీకర్ ఓం బిర్లా గుర్తు చేశారు. అబేకు నివాళి అర్పించిన తర్వాత లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో సభను వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు.రాజ్యసభలోనూ అబే మృతి పట్ల నివాళి అర్పించారు. చైర్మెన్ వెంకయ్యనాయుడు నివాళి సందేశాన్ని వినిపించారు. భారత్, జపాన్ మధ్య బలమైన బంధం ఏర్పడడంలో షింజో అబే ఎంతో సహకరించినట్లు వెంకయ్య తెలిపారు. అబే మృతికి గౌరవ సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
Tags: Parliament begins with adjournments