11 నుంచి 20 రోజుల పాటు పార్లమెంట్ 

Date:15/11/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 11 నుంచి 2019 జనవరి 8 వరకు జరుగుతాయి. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) ఈ మేరకు ప్రతిపాదన చేసింది. మంగళవారం రాత్రి సమావేశమైన కమిటీ తమ ప్రతిపాదన తెలపగా..
కేంద్ర మంత్రి విజయ్ గోయెల్ తెలిపారు. దాదాపు 20 రోజులు సభ జరుగుతుందని మంత్రి అన్నారు. డిసెంబరు 11న ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల ఫలితాలు వెలువడతాయి. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో శీతాకాల సమావేశాలు కాస్త ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి.
2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తోన్న నాలుగు కీలక రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడే రోజే శీతాకాల సమావేశాలు ప్రారంభించాలని నిర్ణయించడం గమనార్హం. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే చివరి పార్లమెంట్ సమావేశాలు కావడంతో ఈ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాఫెల్ యుద్ధ విమానాల విషయమై ప్రధాని నరేంద్ర మోదీని, ఎన్టీయే సర్కార్‌రు తీవ్రంగా విమర్శిస్తోంది. మరోవైపు ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభ ఆమోదం కోసం వేచి చూస్తోంది. గతంలోనే లోక్‌సభ ఆ బిల్లును ఆమోదించింది.
Tags; Parliament for 11 to 20 days

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *