Natyam ad

రేపటి నుంచి పార్లమెంట్.. నేడు అఖిలపక్ష సమావేశం

న్యూఢిల్లీ ముచ్చట్లు:

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఈ నెల 7న ప్రారంభమై 29న ముగియనున్నాయి. సాయంత్రం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వర్గాలు తెలిపాయి. ఈ సారి సమావేశానికి ముందు సంప్రదాయంగా నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి బదులు బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశాన్ని పిలవాలని నిర్ణయించారు.ఇదిలా ఉండగా.. శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఉభయ సభల ముందుకు 16 బిల్లులను తీసుకురానున్నది. మరో వైపు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి లోక్‌సభ, రాజ్యసభకు చెందిన వివిధ పార్టీలకు ఆహ్వానాలు పంపారు. భేటీలో ప్రధాని మోదీ సైతం పాల్గొనే అవకాశం ఉంది. సమావేశాల్లో ముఖ్యమైన అంశాలు, పార్లమెంట్‌ వ్యవహారాలపై చర్చించేందుకు ఆయన ఆహ్వానాలు పంపారు. ఇంతకు ముందు పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్‌ కీలక సమావేశం నిర్వహించింది. సరిహద్దు ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం సహా ప్రజల భద్రతకు సంబంధించిన అన్ని అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తాలని పార్టీ నిర్ణయించింది.

 

Post Midle

Tags: Parliament from tomorrow. All party meeting today

Post Midle