వాయిదాలతోనే పార్లమెంట్ 

DAte:27/03/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
అన్నాడీఎంకే, కాంగ్రెస్ సభ్యుల పోటాపోటీ నినాదాలతో పార్లమెంట్‌ ఉభయ సభలు దద్దరిల్లాయి. అధికార, విపక్ష సభ్యుల ధోరణితో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ లోక్ సభలో ఇవాళ విపక్షాలు ఆందోళన చేశాయి.  గందరగోళంగా మారడంతో లోక్ సభ రెండు సార్లు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైనా.. ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఒక దశలో స్పీకర్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ సభ్యులు… వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు.లోకసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది… సభ ప్రారంభమైనప్పటి నుంచి కావేరి బోర్డు ఏర్పాటు చేయాలని నినాదాలతో సభను స్పీకర్ వాయిదా వేశారు.అన్నాడీఎంకే సభ్యుల ఆందోళనలతో లోక్‌సభలో గందరగోళం నెలకొంది. గంట వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ స్పీకర్‌ వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు.అవిశ్వాస తీర్మానంపై చర్చకు ప్రభుత్వం భయపడుతోందని కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత మల్లికార్జున  అన్నారు. అవిశ్వాసంపై చర్చ చేపట్టాల్సిందేనని డిమాండ్‌ చేశారు. అయితే సభ సజావుగా సాగకపోతే  చర్చ చేపట్టడం కుదరదని స్పీకర్‌ అన్నారు. సభా నిర్వహణకు సహకరించాలని అన్నాడీఎంకే సభ్యలను కోరారు. అయినప్పటికీ వారు ఆందోళన విరమించకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు. అటు  రాజ్యసభను బుధవారంకి వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.15నిమిషాల వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో అదే పరిస్థితి నెలకొంది. టీడీపీ, అన్నాడీఎంకే ఎంపీలు సభలో నినాదాలు కొనసాగించారు. కావేరు బోర్డు ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే ఎంపీలు సభలో నినాదాలు చేశారు. ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలు సభలో ఆందోళన చేపట్టారు. సభ సజావుగా జరగాలని చైర్మన్ కోరినప్పటికీ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభను బుధవారానికి వాయిదా వేశారు.
Tags:Parliament with the installments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *