Part of the garage

Part of the garage

– ఐటీ దాడులపై మంత్రి లోకేష్ స్పందన
Date:12/10/2018
అమరావతి  ముచ్చట్లు:
శుక్రవారం నాడు ఎంపీ సీఎం రమేష్ నివాసాలు, కార్యాలయాలపై జరిగిన ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆపరేషన్ గరుడలో భాగంగా ఆంధ్రులపై మోడీ దాడి చేస్తున్నారు. విభజన హామీలు నెరవేర్చమన్నందుకు మోడీ ఏపీ పై కక్ష కట్టారని అయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కోన్నారు. కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నందుకే సీఎం రమేష్ పై ఐటీ దాడులు జరిగాయాని అన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాం. హోదా తో పాటు ఇచ్చిన 18 హామీలు నెరవేర్చాలి అని నిలదీసినందుకు మోడీ ఆంధ్రప్రదేశ్ పై కక్ష కట్టారు.మొన్న బీద మస్తాన్ రావు,నిన్న సుజనా చౌదరి,ఈ రోజు సిఎం రమేష్. కడప ఉక్కు, ఆంధ్రుల హక్కు అని అన్నందుకు ఐటీ దాడులు జరుగుతున్నాయి. సీఎం రమేష్ దీక్ష చేసి ఈ రోజుకి వంద రోజులు పూర్తయ్యింది అయినా కేంద్రంలో చలనం లేదు. ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు రాకుండా చెయ్యాలి అని మోడీ రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల పై ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.
Tags:Part of the garage

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *