వైఎస్సార్‌ కంటి వెలుగు శిబిరంలో పాల్గొనండి

Participate in the YSSAR Eye Lamp Camp

Participate in the YSSAR Eye Lamp Camp

-10 నుంచి ప్రారంభం
– డాక్టర్‌ సోనియా

Date:09/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ కంటి వెలుగు శిబిరాలలో పాల్గొని చికిత్సలు చేయించుకోవాలని మండల మెడికల్‌ ఆఫీసర్‌ సోనియా పిలుపునిచ్చారు. బుధవారం ఆమె మండల కార్యాలయంలో పోస్టర్లను , కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మాట్లాడుతూ మండలంలోని 169 పాఠశాలలో మొత్తం 17,995 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ఈ విద్యార్థులకు పాఠశాలల్లో వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం క్రింద ప్రతి పాఠశాలలోను కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ శిబిరాలు ఈనెల 16 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమయంలో తల్లిదండ్రులు విద్యార్థులను తప్పకుండ పాఠశాలలకు పంపాలన్నారు. రెండవ విడతలో నవంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు శిబిరాలు నిర్వహించి, విద్యార్థులకు అవసరమైన అద్దాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో భారతి, మాజీ వైస్‌ ఎంపీపీ రామచంద్రారెడ్డి, డాక్టర్లు ఆనందరావు, వైఎస్సార్సీపి నాయకుడు దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, సూపర్‌వైజర్‌ హరినాథరెడ్డి, ఆశవర్కర్లు , సిబ్బంది పాల్గొన్నారు.

రహదారులపై ఎడమవైపున వెళ్లాలి

Tags: Participate in the YSSAR Eye Lamp Camp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *