Participate in volunteer surveys

స్వచ్చ సర్వేక్షణ్‌ లో భాగస్వామ్యులుకండి

Date:17/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్చసర్వేక్షణ్‌ 2020లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులుకావాలని కమిషనర్‌ కెఎల్‌.వర్మ పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని దూళ్లవాండ్లఇండ్లలో మహిళలతో కలసి స్వచ్చసర్వేక్షణ్‌ చైతన్యర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్చ సర్వేక్షణ్‌లో పాల్గొనాలని , పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు వెహోక్కలు నాటాలని, ప్లాస్టిక్‌ వినియోగం నిషేధించాలని, బహిరంగ మలమూత్ర విసర్జన చేయరాదంటు మహిళలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ వర్మ మాట్లాడుతూ స్వచ్చ సర్వేక్షణ్‌లో భాగంగా ప్రతి రోజు ప్రాంతాల వారిగా చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ ర్యాలీలు నిర్వహించడం, కరపత్రాలు పంపిణీ చేయడం చేపడుతున్నామన్నారు. మున్సిపాలిటిని స్వచ్చ సర్వేక్షణ్‌ 2020లో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరు బాగస్వామ్యులై మున్సిపాలిటి అభివృద్ధికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌ తదితరులు పాల్గొన్నారు.

రూ.2 కోట్లతో 35 కెవి సబ్‌స్టేషన్‌ నిర్మాణం

Tags: Participate in volunteer surveys

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *