సుందర తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమంలో భాగస్వాములు కావడం పూర్వజన్మ సుకృతం
– జిల్లా జాయింట్ కలెక్టర్ డి.కె.బాలాజీ
తిరుమల ముచ్చట్లు:

తిరుమల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగా “సుందర తిరుమల-శుద్ధ తిరుమల” కార్యక్రమంలో తాము భాగస్వాములు కావడం పూర్వజన్మ సుకృతమని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ డి.కె.బాలాజీ అన్నారు. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలలో మంగళవారం టీటీడీ ఉద్యోగులు, శ్రీవారి సేవకులతో కలిసి జాయింట్ కలెక్టర్ శ్రమదానం (స్వచ్ఛంద పరిశుభ్రత సేవ) నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, క్లిష్ట సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య నిర్వాహణలో మెరుయిన పరిశుభ్రత చర్యలు చేపట్టిన టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకుల సేవలను ఆయన అభినందించారు. అనంతరం ఉద్యోగులు, శ్రీవారి సేవకులతో కలిసి ఆయన నారాయణగిరి ఉద్యానవనాలను శుభ్రం చేశారు.జెఈవో శ్రీమతి సదా భార్గవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Tags: Participating in Sundara Tirumala-Shuddha Tirumala program is auspicious
