పోలింగ్ ఏర్పాట్లలో పార్టీలు తలమునకలు

Date:010/04/2019
నెల్లూరు ముచ్చట్లు:
ఎన్నికలు ఎన్నికలు అంటూ అనుకున్న అంత సమయం లేదు. నామినేషన్లు ఘట్టం ఇలా ముగిసిందో లేదో రెండు వారాల్లో ప్రచార పర్వం ముగిసిపోయింది. నిన్నమొన్నటివరకు హోరెత్తిన మైకులు ఆగడంతో పోలింగ్ ఏర్పాట్లలో పార్టీలు తలమునకలు అయ్యాయి. పోలింగ్ కి ఒకే రోజు సమయం ఉండటంతో ఓటర్లకు వివిధ రూపాల్లో ప్రలోభాలకు ప్రధాన పార్టీలు తెరతీశాయి. ఓటుకు వెయ్యి రూపాయల నుంచి మూడు వేలరూపాయల వరకు ప్రాంతాన్ని, అభ్యర్థి ధనబలాన్ని బట్టి పంపిణి మొదలైంది. ఎన్నికల సంఘం నిఘా, పోలీసుల తనిఖీలు సైతం పంపకాలకు పెద్దగా బ్రేక్ వేయలేక పోతున్నాయి. మరో పక్క డబ్బులు ఇంకా తమకు అందడం లేదంటూ ప్రధాన రాజకీయ పక్షాల కార్యాలయాలకు ఓటర్లు క్యూ కడుతున్నారు. మరో పక్క డబ్బు పంపిణి బాధ్యతలు చేపట్టిన వారు అభ్యర్థి ఇచ్చిన సొమ్ము లో కొంత కోత పెడుతుంటే మరికొందరు మొత్తం గుటకాయస్వాహా చేస్తున్నారు. ఈ వ్యవహారాలపై కూడా పార్టీ కార్యాలయాలకు ఫిర్యాదులు అందుతున్నాయి.మరోపక్క అధికార తెలుగుదేశం, వైసిపి లు పోటాపోటీగా డబ్బులు పంపిణీ చేస్తుంటే జనసేన మాత్రం ఈ రేసులో పూర్తిగా వెనుకబడింది. ఒక్క టీ గ్లాస్ ను మాత్రం అన్ని నియోజకవర్గాల్లో పంపిణీ చేసినట్లు సమాచారం. నువ్వా నేనా అన్నట్లు గా సాగిన ప్రచారం ఆ తరువాత పంపిణీల తో ఓటరు ఉక్కిరి బిక్కిరి అయినా ఏ పార్టీకి తమ ఓటు వేయాలో ముందే డిసైడ్ అయ్యి సైలెంట్ కావడం విశేషం. ప్రచార యుద్ధం ముగిసి పోగా ఇక పోలింగ్ యుద్ధం ఎలా సాగనుందో చూడాలి.
Tags:Parties in polling arrangements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *