కరోనా నిబంధనలు పాటించకుండా పార్టీలు

Date:17/09/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

కొందరు పోలీసులు కరోనా నిబంధనలు పాటించుకుండా పార్టీలు నిర్వహిస్తున్నారు. దీంతో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. దీనిపై చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు కానిస్టేబుల్‌ని సస్పెండ్ చేశారు.
కరోనా వారియర్స్‌లో పోలీసులు కూడా ఒకరు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తోంది. ఇప్పటికే పోలీస్ శాఖలో పనిచేసేవారు కూడా వందలాది మంది
కరోనా బారిన పడ్డారు. అందులో కొందరు వైరస్ వల్ల ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇలాంటి సమయంలో వేడుకలకు దూరంగా ఉండాలని అధికార యంత్రాంగమంతా చెబుతోంది. అయితే ప్రజలను
అప్రమత్తం చేయాల్సిన పోలీస్ శాఖలోని కొందరు వ్యక్తులు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. కోవిడ్ నిబంధనలు పట్టించుకోకుండా పార్టీలు, వేడుకలు నిర్వహిస్తున్నారు.తాజాగా రాచకొండ
కమిషనరేట్ పరిధిలోని కీసరలో ఓ కానిస్టేబుల్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. దీనికి హాజరైన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి జన్మదిన
వేడుకలు జరుపుకున్న శివకుమార్ అనే కానిస్టేబుల్‌ను సీపీ షనూర్ బాబు సస్పెండ్ చేశారు. నవీన్ అనే కానిస్టేబుల్‌కు ఛార్జ్ మెమో ఇచ్చారు. ఇన్‌స్పెక్టర్‌కు సీపీ షో కాజ్ నోటీస్ జారీ చేశారు.
ఇలాంటి కొందరి వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు తాజాగా తెలంగాణలో 2159 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం ఇప్పటి
వరకు నమోదైన కేసుల సంఖ్య 1,65,003కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1005కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం
బులిటెన్‌ విడుదల చేసింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,108 మంది కోలుకున్నారు.

 

 

టాటాకే పార్లమెంట్ నిర్మాణం…

 

Tags:Parties not complying with corona rules

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *