Natyam ad

వరదలను పట్టించుకోని పార్టీలు

అదిలాబాద్ ముచ్చట్లు:


ఇల్లు కాలి ఒక‌డు ఏడుస్తుంటే. ఎదురిళ్ల‌వారు స‌హాయానికి వెళ్లి కొట్టుకున్నార‌ట‌. అదుగో ఆలా ఉంది బీజేపీ, టీఆర్ ఎస్ వారి తంతు. అస‌లే వ‌ర‌ద‌ల‌తో గూడూ, గోతం న‌ష్ట‌పోయి  జ‌నం బాధ‌ప‌డుతున్నారు.  జ‌నానికి  ప్ర‌భుత్వం స‌హాయ స‌హ‌కారాలు అందించాలి. కానీ బీజేపీ, టీఆర్ ఎస్ నేత‌లు గొడ‌వ‌ల‌కు దిగారు.మంచిర్యాల ఐబీలో వరద బాధితులను ఆదుకోవాలని బీజేపీ నేతలు దీక్ష చేశారు. అయితే జీఎస్టీ  పెంపును నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ నేతలు  కూడా నిరసన తెలిపారు. పరస్పర విమర్శలతో ఇరు పార్టీల నేతలు కొట్టు కున్నారు. రంగంలోకి దిగి ఇరు పార్టీల నేతలను పోలీసులు చెదరగొట్టారు. జిల్లాలో గతవారం రోజులనుంచి కురిసిన భారీవర్షాలు వరదల కారణంగా జిల్లాలో పెద్ద ఎత్తున పంట లకు నష్టం వాటిల్లింది. ఈ నష్టం కార ణంగా దాదాపు 10 వేల మంది అన్నదాతలు కొలుకోలేని పరిస్థితికి చేరుకు న్నారు. వ్యవసాయాధికారులు యుద్ధ ప్రాతిపాదికన రూపొందించిన ప్రాథమిక పంటలనష్టం అంచనాలను సర్కారుకు నివేదించారు. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి పత్తి, సోయాబీన్‌, మొక్కజొన్న, కందుల పంటలు పెద్దఎత్తున దెబ్బ తినడంతో ఇక మళ్లీ ఆ పంటలను సాగుచేయడం రైతులకు సవాలుగా మారనుంది. పంటలసాగు ఆలస్యం  కానున్నం దున దిగుబడుల సమయం మరింత దూరమవుతుందని చెబుతున్నారు.

 

Tags: Parties that ignore floods

Post Midle
Post Midle