గ్యాలరీల్లో పార్టీల నేతలు

Party leaders in galleries

Party leaders in galleries

Date:19/05/2018
బెంగళూర్ ముచ్చట్లు:
కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా ఇవాళ ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ వైపు అసెంబ్లీలో బీజేపీ, కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు నువ్వా నేనా అన్నట్టు కత్తులు నూరుకుంటూ కనిపిస్తే… మరోవైపు అసెంబ్లీ గేలరీల్లో ప్రత్యర్థి పార్టీలకు చెందిన అగ్రనేతలంతా ఒకేచోట కూర్చోవడం ఆసక్తి రేపింది. కాంగ్రెస్ అగ్రనేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్, మల్లికార్జున ఖర్గేలతో పాటు బీజేపీ నేతలు అనంత్ కుమార్, శోభా కరంద్లాజే, సదానంద గౌడ తదితరులు నవ్వుతూ పరస్పరం అభివాదం చేసుకున్నారు. వారితో పాటు రాష్ట్రానికి చెందిన పలు పార్టీల నేతలు కూడా పక్కపక్కనే కూర్చుని అసెంబ్లీ సమావేశాలను వీక్షించారు. దీంతో కర్ణాటక విధాన సౌధలో ఆయా పార్టీల మధ్య ఓవైపు ఉత్కంఠ, మరోవైపు ఉల్లాసం ఒకేసారి చోటుచేసుకున్నట్టైంది.
TAgs:Party leaders in galleries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *