పార్టీ జాతీయ ప్రధాన కార్య దర్శి అఫక్ అహమ్మద్ ఖాన్ 

Date:17/09/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
ముందస్తు ఎన్నికల నేపద్యం లో జనత దళ్ (యు) పార్టీ  తెలంగాణా రాష్ట్రము ఫై దృష్టి సారించింది. ఈ నేపధ్యం లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్య దర్శి  అహమ్మద్ ఖాన్ తెలంగా రాష్ట్ర పరిశీలకులుగా హైదరాబాద్ వచ్చారు.ఈ సందర్బంగా రాష్ట్రం లో అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సమావేశమై రాష్ట్రం లో పార్టీ పరిస్థితి ఫై చర్చించారు. తెలంగాణా రాష్ట్రం లో కూడా పార్టీ ఉనికిని కాపాడుకోవాలని, రానున్న ముందస్తు ఎన్నికల్లో పార్టీ అభ్యర్దులను నిల బెట్టె విషయం ఫై సమావేశంలో చర్చించారు.
సమావేశానంతరం అహమ్మద్ ఖాన్ మీడియా సమావేశం లో మాట్లాడుతూ బీహార్ రాష్ట్రం లో తమ పార్టీ అధికారం లో ఉందని,  రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా పార్టీ ని విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. తెలంగాణా రాష్ట్రం లో ముందస్తు ఎన్నికలు జరుగుతున్నందున పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు పరిశీలకుడిగా వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రం లో పార్టీ కొంతమేరకు బలహీనంగా ఉన్నప్పటికీ పార్టీ బలోపేతం చేసే దిశలో అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.
ఈ క్రమం లో పార్టీ బలోపేతం తో పాటు, రానున్న ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీ లతో కలిసి పోటి చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికలలో పొత్తు,  రాష్ట్రం లో పార్టీ బలోపేతం ఫై ఈ నెల 25 న ఎల్ బి నగర్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర స్టాయి నేతలతో విస్తృత స్తాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశం లో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర కమిటికి పంపి ,అధిస్టానం నిర్ణయం మేరకు ఎన్నికల్లో పోటి, పోత్తులఫై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణా లో బిజెపి తో కలిసి పోటిచేస్తారా అని ప్రశ్నించగా బీహార్ లో బిజెపి తో పొత్తు ఉన్నప్పటికీ అది ఆ రాష్ట్రం వరకే అని, దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఆ పార్టీ తో పొత్తు ఉండబోదన్నారు. ఈ సమావేశం లో పార్టీ రాష్ట్ర అద్యక్షులు కే.పురుషోత్తం రెడ్డి, ప్రధాన కార్య దర్శి వాహిద్, పార్టీ సినీయర్ నేతలు కే.పట్టాభిరామయ్య ,కాలువ  యాదగిరి ముదిరాజ్  తదితరులు పాల్గొన్నారు.
Tags:Party national headquarters Afrakh Ahmad Khan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *