పసలేని పచ్చమీడియా కథనాలు- నారావారి పాటలు
-ట్వీట్టర్‌లో పప్పు, పత్రికలో బాబు
– గ్రామం పేరు, జిల్లా తెలియని పచ్చమీడియా
సోమల ముచ్చట్లు:
ఎలాంటి సంబంధం లేని విషయాలలో పచ్చమీడియా పసలేని కథనాలు వేయడం, వాటిని భూతద్దంలో చూపిస్తూ నారావారు కూనిరాగాలతో ప్రకటనలు ఇవ్వడంతో అభాసుపాలౌతున్నారు. పుంగనూరు నియోజకవర్గంలోని సోమల మండలం గల్లావారిపల్లెలో పాల రైతులకు , ఒక డైరీకి సమస్యలు ఉత్పన్నమైంది. దీనిపై సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యకర్త మధుసూదన్ ఆ డైరీని విమర్శిస్తూ పాలను రోడ్డుపై పోశాడు. దీనికి కారణం మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన శివశక్తి డైరీకి సంబంధం ఉందంటు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఎటుపాలుపోక , మినీమహనాడుకు వెళ్లారని పాలసేకరణ నిలిపివేత అంటు అసత్య కథనాలు వల్లి పత్రికల్లో ఆరోపణలు చేశారు. వాస్తవాలు తెలుసుకోలేని స్థితిలో ఉన్న నారావారు మంత్రిపై ట్విట్టర్‌లో ఆరోపణలు చేశారు. వార్తలు వెలుగుచూడటంతో తెలుగుదేశం కార్యకర్త మధుసూదన్ ఈ సంఘటనకు శివశక్తి డైరీకి సంబంధం లేదని తెలపడంతో తెలుగుతమ్ముళ్లు నోరుమూశారు. అలాగే గల్లావారిపల్లెకు చెందిన పాలరైతులు శివశక్తి డైరీకి సంబంధం లేదని విలేకరులకు తెలపడంతో పచ్చమీడియాకు పాలుపోలేదు. కాగా శివశక్తి డైరీపై ఆరోపణలు చేసిన మధుసూదన్ బెంగళూరులో వివిధ రకాల దొంగతనం కేసుల్లో నిందితుడు. పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండ పొవడంతో ఉనికిని చాటుకునేందుకు మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై అసత్య ఆరోపణలు చేయడంపై ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సోషియల్ మీడియా ఇన్‌చార్జ్ నవీన్‌కుమార్‌రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈనాడుకు జిల్లా తెలియదు….జ్యోతికి గ్రామం తెలియదు…
పుంగనూరు నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా దానిని మంత్రి పెద్దిరెడ్డి కుటుంభానికి ఆపాదించి ఆరోపణలు చేయడం పచ్చమీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతికి అలవాటుగా మారింది. సోమవారం సోమల మండలం గల్లావారిపల్లెలో పాల రైతుల గొడవ జరిగింది. ఈనాడులో అన్నమయ్యజిల్లా వెంగంవారిపల్లెగా తెలిపారు. ఆంధ్రజ్యోతిలో లింగంవారిపల్లె, వెంగంవారిపల్లె అని రాశారు. అసత్య వార్తలకు ఇంతకంటే నిదర్శనం మరోకటి ఉండదు. పుంగనూరు అనగానే పచ్చమీడియా పాట్లు ఎలా తెల్లారిందో గమనించగలరు.
పొరబాటున శివశక్తి పేరు చెప్పాను క్షమించండి…
తెలుగుదేశం కార్యకర్త మధుసూదన్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ శ్రీజ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేశాం. ఆవేశంలో శ్రీజ మేనేజర్ నారాయణరెడ్డి పేరుకు బదులుగా శివశక్తి డైరీ మేనేజర్ అని చెప్పాను. ఇందులో శివశక్తికి ఎలాంటి సంబంధము లేదు. ఈ సమయంలో శ్రీజ మేనేజర్ నారాయణరెడ్డి ఫోన్ చేసి ఆటోచార్జీలు పెరిగినందున ఆటో పంపలేదని తెలిపారు. పొరబాటున శివశక్తి డైరీ పేరు వాడినందుకు క్షమించాలని కోరుతున్నాను.
– మధుసూదన్, తెలుగుదేశం కార్యకర్త, గల్లావారిపల్లెం, సోమల మండలం.
Tags: Pasaleni Pachamedia articles – Naravari songs