సాగిరివలస రహదారిలో ప్రయాణికుల పాట్లు

Date:25/09/2020

విశాఖపట్నం  ముచ్చట్లు:

డుంబ్రిగుడ మండలంలో గల సోవ పంచాయితీకి పరిధిలోగల సాగిరివలస గ్రామానికి వెళ్లే రహదారిలో ప్రజలు పడరాని పాట్లు పడుతూ తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.మట్టి రహదారి కావడంతో ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు రహదారి మొత్తం చిత్తడిగా మారి అడుగుతీసి అడుగు వేయలేని దుస్థితి ఉందని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నిత్యావసర సరుకులు,అత్యవసర సేవలు పొందాలన్న ఈ రహదారి పైనే నడుచుకుంటూ వెళ్ళవలసిన పరిస్థితి ఎదుర్కొంటున్నామని స్థానిక విలేకరుల ముందు వాపోయారు.ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులకు,ప్రభుత్వ అధికారులకు,విన్నవించిన స్పందించటం లేదని వారు తెలిపారు.ఇప్పటికైనా మా గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించి అత్యవసర,నిత్యావసర,సేవలు పొందేటట్లు చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

రైతులకు పత్తి పంట పై అవగాహన కార్యక్రమం

Tags: Passenger songs on Sagirivalasa road

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *