Natyam ad

ప్రైవేటు బస్సుబోల్తా..ప్రయాణికులకు గాయాలు

తిరుపతి ముచ్చట్లు:


తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం, కృష్ణాపురం  జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. హైదరాబాదు నుండి చెన్నై వెళ్తున్న షామ్మ సర్దార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు  దొరవారిసత్రం, కృష్ణాపురం జాతీయ రహదారిపై అదుపుతప్పి డివైడర్ను ఢీకొని బోల్తా పడినట్లు  సమాచారం. షమ్మ సర్దార్ ప్రైవేట్ ట్రావెల్స్  డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు బోల్తాపడింది. బస్సులో 26 మంది  ప్రయాణిస్తుండగా వారిలో 6 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని  సమీపంలోని  నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి  తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Tags:Passengers injured in private bus

Post Midle
Post Midle