Natyam ad

ఉబికి వస్తున్న పాతాళ గంగ

శ్రీ సవ్యసాయి ముచ్చట్లు:


శ్రీ సత్య సాయి జిల్లా ఓ.డి చెరువు మండలం గాజుకుంటపల్లిలో ఓ బోరు బావిలో పాతాళ గంగ ఉబికి వస్తోంది. మోటారు సాయం లేకుండా తానంతట తానే పొంగిపొర్లుతోంది. గ్రామానికి చెందిన షానవాజ్ ఖాన్ గత రెండున్నరేళ్ల క్రితం 600 అడుగులు బోరు బావి తవ్వించాడు. బోరు వేస్తున్న సమయంలో కొద్దిగా నీరు పడటంతో, ఉన్న కొద్దిపాటి నీటితోనే పంటలు వేయాలని మోటారు బిగించాడు. కొన్ని రోజుల తర్వాత బోరులో నీరు ఎండిపోవడంతో మోటారు తీసేసి అమ్ముకున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు భూగర్భ జలాలు పెరగడంతో బోరుబావిలో వాటంతకు అవే నీరు ఉబికి వస్తున్నాయి. వెయ్యి అడుగుల తవ్వినా చుక్క నీరు పడని ఈ కరువు ప్రాంతంలో బోరు బావిలో వాటంతటవే నీరు ఉబికి వస్తుండడంతో  రైతు ఆనందానికి హద్దులు లేకుండా పోతోంది. మోటారు బిగించి పంటలు వేస్తానని రైతు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

 

Tags: Patala Ganga coming to Ubi

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.