మహిళా విద్య సమాజ ప్రగతికి బాట : MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి
శ్రీకాళహస్తి ముచ్చట్లు:
మహిళలందరూ చదువుకోవాలని అప్పుడే వారి కుటుంబము సమాజం కూడా ప్రగతి పథంలో నడుస్తోందని ఎమ్మెల్యే అన్నారు.అందులో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్నం,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి విచ్చేసిన నిరుపేద కుటుంబానికి చెందిన ఇద్దరు యువతుల చదువుకు కావలసిన ఆర్థికసాయాన్ని అందజేశారు ఎమ్మెల్యే ,రామచంద్రపురం గ్రామం,నిరుపేద కుటుంబానికి చెందిన నస్రీన్ తిరుపతిలో ఎం.సీ.ఏ చదువుతున్నారు,కళాశాల ఫీజు కట్టడానికి వారి ఆర్థిక స్తోమత సరిపోకపోవడంతో ఎమ్మెల్యే ని ఆశ్రయించారు.ఎమ్మెల్యే ఆమె సమస్యను అర్థం చేసుకొని తన కాలేజీ ఫీజు ₹35,000/- వేల రూపాయలను వెంటనే అందజేసి అలాగే ఇంకేమన్నా సహాయం కావాలంటే తనను నేరుగా వచ్చి కలిసి తెలియజేయమన్నారు.అలాగే తొట్టంబేడు మండలం, చిన్నసింగమల గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన జోష్నా తన ఉన్నత విద్య చదువుకోవాలనే ఆశతో వారి కుటుంబం ఆర్థిక స్తోమత సరిపోకపోవటంతో ఈరోజు ఎమ్మెల్యే ని ఆశ్రయించారు. ఎమ్మెల్యే తో తను ఉన్నతవిద్య చదువుకోవాలని తన తండ్రి ఆటో నడుపుతూ వచ్చే సంపాదన కుటుంబ ఖర్చులకి సరిపోతుందని తెలియజేశారు.వెంటనే ఎమ్మెల్యే జోష్ణ చదువు బాధ్యత పూర్తిగా తానే తీసుకుంటానని ఆమెకు భరోసా ఇచ్చారు. అలాగే తను బాగా చదువుకొని తన కుటుంబ సభ్యులను బాగా చూసుకోవాలని తెలిపారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Path to Women’s Education Community Progress: MLA Biyapu Madhusudan Reddy