పఠాన్ చెరు ఈఎస్ఐ ఆసుపత్రి ఆధునీకరణ పనులు ప్రారంభం
సంగారెడ్డి ముచ్చట్లు:
రామచంద్రపురం పరిధిలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చేపట్టిన ఆధునీకరణ పనులను రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, మల్లా రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.
మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఆర్.సి. పూర్ ఈ ఎస్ ఐ ఆసుపత్రిని 20 కోట్ల 70 తో ఆధునికీకరణ పనులు పూర్తి చేసి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చింది. పఠాన్ చేరు ప్రాంత కార్మికులకు ఈఎస్ఐ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించడం సంతోషంగా ఉంది. అన్ని సదుపాయాలు ఉన్న రోగులకు వైద్య సేవలు చేయకపోవడం పై డాక్టర్ల పై అసంతృప్తి వుంది. పేదలకు వైద్యం చేయడం తో నిర్లక్ష్యం చేయద్దని అన్నారు.
మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చొరవతో తెలంగాణ రాష్ట్రం లోని కార్మికుల సంక్షేమం కోసం ఈఎస్ఐ ఆసుపత్రిలను పటిష్ఠం చేసి, వైద్య సేవలు అందిస్తున్నరు. రామచంద్రపురం లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చేపట్టిన ఆధునీకరణ పనులను పూర్తి చేసుకోవడం సంతోషం గా ఉంది. త్వరలో పఠాన్ చేరు లో 30 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేయబోతున్నము. తెలంగాణ లో కార్మికులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారని అన్నారు.
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈఎస్ఐ ఆసుపత్రిలో చేపట్టిన ఆధునీకరణ పనులతో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు.
Tags: Pathan Cheru ESI Hospital modernization work started

