పట్టణ అభివృద్ధియే లక్ష్యంగా పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి

– కోటి రూపాయలతో చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణం

Date:23/02/2021

పత్తికొండ  ముచ్చట్లు:

పత్తికొండ పట్టణంలో కోటి రూపాయలతో చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శ్రీదేవి  భూమి పూజ చేసి ప్రారంభించారు. స్థానిక లక్ష్మీ నగర్, రామకృష్ణ నగర్ లలో సిసి రోడ్డు, డ్రెయినేజీ వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షం పడినా లక్ష్మీ నగర్ కాలనీలో ప్రజలు బయటకు వచ్చేందుకు కూడా ఇబ్బందులు పడేవారు. వర్షాకాలంలో కాలనీవాసుల సమస్యలను ఎమ్మెల్యే శ్రీదేవి  స్వయంగా పరిశీలించారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించి ఎమ్మెల్యే  నిధులతో సుమారు 80 లక్షల రూపాయలు మంజూరు చేయించి పనులు ప్రారంభం అయ్యేలా ఎమ్మెల్యే శ్రీదేవి చొరవ తీసుకున్నారు. రామకృష్ణ నగర్ లో రెండు లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే స్పందించిన తీరు పట్ల కాలని మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దీపిక,మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ , మేజర్ గ్రామ పంచాయతీ ఈఓ కృష్ణ కుమార్, పంచాయతీ రాజ్ అధికారులు శేషయ్య, మాణిక్యారావు, వెంకటేశ్, మరియు వైయస్సార్ నాయకులు బజారప్ప, పల్లె ప్రతాపరెడ్డి, శ్రీరంగడు, సోమ శేఖర్,భాస్కర్ నాయక్, కాంట్రాక్టరు మురళి, దూదెకొండ సర్పంచ్ రెహమాన్  పాల్గొన్నారు.

వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags; Pathikonda MLA Sridevi aims at urban development

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *