కొడుకు కోసం బాటలు

విశాఖపట్టణం ముచ్చట్లు:

ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే ఈ తరహా ప్రచారంపై యలమంచిలిలో చర్చ జరుగుతోంది. వైసీపీలో ఉన్న బలమైన నాయకులు రేస్‌లోకి రాకుండా నియంత్రించే వ్యూహంగా తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో కాపు, వెలమ, గవర సామాజికవర్గాలు బలం ఎక్కువ. కాపులు ఓటింగ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. కన్నబాబురాజుకు టిక్కెట్ దక్కకపోతే మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు లేదా కాపు సామాజికవర్గానికి చెందిన మరో నేత పోటీ చేయొచ్చని ప్రచారం మొదలైంది. పైగా ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టసభల్లో అడుగు పెట్టాలని విశాఖ డెయిరీ వైస్‌ ఛైర్మన్‌ ఆనందకుమార్‌ పట్టుదలతో ఉన్నారు. ఆనందకుమార్‌ సొంత నియోజకవర్గం యలమంచిలే.యువీ రమణమూర్తి రాజు అలియాస్ కన్నబాబు. యలమంచిలి ఎమ్మెల్యే. ఉమ్మడి విశాఖజిల్లా వైసీపీ కీలక నేతల్లో ఒకరు. కుండబద్దలు కొట్టేసినట్టు మాట్లాడే ఆయన వైఖరి సొంత పార్టీని, యంత్రాంగాన్ని ఇబ్బందులోకి నెట్టిన సందర్భాలు ఉన్నాయి. మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచలో భాగంగా రమణమూర్తిరాజు కుటుంబానికి పదవిని ఆఫర్ చేసింది వైసీపీ హైకమాండ్. అయితే మంత్రి పదవి రేసులో ఉండటం, కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం నామినేటెడ్ పదవిని వదులుకున్నారనే ప్రచారం జరిగింది.

 

 

యలమంచిలిలో విశాఖ డెయిరీ ఛైర్మన్‌ ఆడారి తులసీరావు కుటుంబంతో మొదట్లో ఢీ అంటే ఢీ అన్నప్పటికీ భవిష్యత్ అవసరాల కోసం రాజీపడ్డారనే టాక్‌ ఉంది. ఈ క్రమంలోనే తులసీరావు కుమార్తె రమాకుమారిని మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఏకపక్షంగా విజయం సాధించడానికి కృషి చేశారు ఎమ్మెల్యే. మెజారిటీ కౌన్సిలర్లను ఎమ్మెల్యే వర్గం గెలిచినప్పటికీ హైకమాండ్ ఆదేశాలకు లోబడి రమాకుమారికి ఛైర్‌పర్సన్‌ పీఠం అప్పగించారు. భవిష్యత్‌ అవసరాల కోసం తన సహజమైన శైలికి విరుద్ధంగా కన్నబాబురాజు ఒక అడుగు వెనక్కి తగ్గరానే అభిప్రాయం బలంగా ఉండేది.ఇక్కడ క్షత్రియ సామాజికవర్గానికి బలమైన ఓటు బ్యాంకు లేనప్పటికీ 2004-2014మధ్య వరసగా రెండుసార్లు కాంగ్రెస్ నుంచి.. 2019లో వైసీపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి మారే మధ్యలో టీడీపీ కండువా కప్పుకొన్నా.. అంతర్గత కారణాలతో అక్కడ ఎక్కువ కాలం ఇమడలేకపోయారు.

 

 

తాజాగా కేస్ట్, సీనియారిటీ కోటా కింద కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆశించినా ఫలితం దక్కలేదు. కుమారుడు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ సుకుమార్ వర్మకు మరోసారి అవకాశం కోసం లాబీయింగ్ చేసినా వర్కవుట్ కాలేదు.ఇంతలో కన్నబాబుకు హైకమాండ్ షాకింగ్ న్యూస్ చెప్పిందనే ప్రచారం జోరందుకుంది. మరోసారి టికెట్‌ ఇవ్వడం లేదనే సంకేతాలు వచ్చాయని ఎమ్మెల్యే సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందుకే ఆయన గేర్‌ మార్చేసినట్టు టాక్‌. తాను వెళ్లే పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు కుమారుడు సుకుమార్‌వర్మను కూడా వెంటబెట్టుకుని వెళ్తున్నారట. ఇంతకాలం షాడో ఎమ్మెల్యేగా పనిచేసిన కుమారుడే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్నారట. ఆ మేరకు లైన్‌ క్లియర్‌ చేసే పనిలో పడ్డారట కన్నబాబు రాజు. వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో తండ్రీకొడుకులు ఇద్దరూ చురుకుగా పాల్గొంటున్నారట. పనిలో పనిగా వచ్చే ఎన్నికల్లో సుకుమార్‌ వర్మే పోటీ చేస్తారని.. ఆయనకు సహకరించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారట.టీడీపీ బలహీనంగా ఉన్నప్పటికీ.. పొత్తులు కుదిరితే యలమంచిలి పోరు రసవత్తరంగా మారే ఛాన్స్‌ ఉంది. దీంతో హైకమాండ్ మనసులోని మాటను.. భవిష్యత్ పరిణామాలను ముందుగానే ఊహించిన కన్నబాబురాజు.. కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం వేగంగా ప్రణాళికలు వేస్తున్నారట. మరి.. మారిన కన్నబాబురాజు వైఖరి ఆయనకు ఏ మేరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

 

Tags: Paths for the son

Leave A Reply

Your email address will not be published.