ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు స్వాగతం

నల్గొండ ముచ్చట్లు:

 

నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు రోగులకు స్వాగతం పలుకుతున్నాయి. ఎన్నిసార్లు సమస్యలపై ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో సమస్యలు, ఇబ్బందులతో సహాజీవనం చేస్తున్నారు పేషంట్లు, వారి అటెండర్లు. సాధారణ సమస్యలకు తోడు… ప్రభుత్వ ఆసుపత్రిలో తాగేందుకు గుక్కెడు తాగునీరు దొరకని పరిస్దితి నెలకొంది. అరగంట పైగా క్యూ లైన్లో నిలబడితే ఒక్క బాటిల్ వాటర్ దొరికితే అదే పదివేలు అన్నట్లుగా తయారైంది పరిస్థితి.నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో గుక్కెడు తాగునీరు దొరకడం పెద్ద భగీరథ ప్రయత్నమే అని చెప్పాలి. పేషంట్ల కోసం ఆర్వో ఫ్యూరీఫైడ్ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. పేషంట్లకు వారి అటెండర్లకు శుభ్రమైన, తాగునీరు అందించేందుకు మాతా శిశు కేంద్రంలో ఏర్పాటు చేసింది. కానీ ప్రభుత్వం ఏ లక్ష్యంతో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసిందో ఆ లక్ష్యం నెరవేడం లేదు. ఉదయం 7గంటల నుండి రాత్రి 7 గంటల వరకు అంటే 24 గంటల్లో కేవలం 12 గంటలు మాత్రమే ఆర్వో ప్లాంట్ ద్వారా తాగునీరు అందుబాటులో ఉంటుంది. మిగతా 12గంటలు అంటే చీకటి పడిన తరువాత మంచినీరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పేషంట్లకు అందుబాటులో ఉండవు. ఇప్పటికే మాతా శిశు కేంద్రంలో కెపాసిటికి మించి పేషంట్లు ఉంటుండగా..వారికి తోడు వారి అటెండర్లతో తాగునీరు అవసరం ఉండే వారి సంఖ్య భారీగా ఉంటుంది. దీనికి తోడు వేసవికాలం కావడంతో తాగునీరు అవసరం అధికంగా, వినియోగం కూడా అధికంగానే ఉంటుంది.పేషంట్ లు లేదా వారి అటెండర్లు ఉదయం 7 గంటలకు తాగునీరు కోసం క్యూలైన్ లో నిలబడటం కనిపిస్తుంది.

 

 

క్యూలైన్ లో నిలబడిన వారు ఒక్క వాటర్ బాటిలో మాత్రమే నీరు నింపేందుకు అవకాశం ఇస్తారు ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్వాహకులు. చాలా సన్నగా వచ్చే నీటిధార వల్ల ఒక్కలీటర్ లేదా రెండు లీటర్ల బాటిలో నీరు నింపుకొవడానికి 5 నుండి 10 నిమిషాల సమయం పడుతుంది. దీంతో తాగునీరు పట్టుకునేందుకు తమ వంతు వచ్చే సరికి దాదాపు 30నిమిషాలకు పైగా సమయం పడుతుండంతో పేషంట్ల అడెండర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు దాదాపు గంట వరకు సమయం పడుతుండటం…. పేషంట్ల వద్ద అటెండర్లు అందుబాటులో లేకపొవడం ఇబ్బందులకు గురవుతున్నారు.మరికొన్నిసార్లైతే కొందరు పేషంట్లకు అటెండర్లు లేకపోవడంతో నేరుగా పేషంట్లే వచ్చి తాగునీరు కోసం గంటసేపటి వరకు క్యూలైన్ లో నిలబడి ఒక్కలీటర్ లేదా రెండు లీటర్ల బాటిల్స్ తాగునీరు పట్టుకుని వెళ్లిపోతున్నారు. రెండో బాటిల్ వాటర్ కావాలంటే మరోసారి క్యూలైన్ లో నిలబడటం తప్పనిసరి. కేవలం ఉదయం పూట మాత్రమే అందుబాటులో ఉండే తాగునీరు పట్టుకోవడం ఓ ప్రహాసనం. రాత్రిపూట తాగునీరు ఆసుపత్రిలో అందుబాటులో ఉండకపోవడం ఓప్రత్యక్ష నరకం.తాగునీరు కావాలంటే బ్రాండెడ్ వాటర్ బాటిల్ కొనాలి. అదికూడా అర కిలోమీటరు ఆసుపత్రి బయటకు నడిచి వెళ్ళాల్సిందే. ప్రసవం కోసం వచ్చే పేషంట్లు డెలివరీ తరువాత వారం రోజుల వరకు ఆసుపత్రిలో చికిత్స తీసుకునే అవకాశం ఉంది. ఈవిధంగా వారం రోజులపాట ఉండి ట్రీట్ మెంట్ తీసుకునే పేషంట్లు, వారి అటెండర్లకు మాత్రం నల్లగొండ జిల్లా కేంద్ర ఆసుపత్రి తాగునీటి నిర్వహణ కన్నీటిని తెప్పిస్తుంది. జిల్లాకు చెందిన మంత్రులు ఈ విషయంలో శ్రద్ధ చూపాలని రోగుల బంధువులు కోరుతున్నారు.

 

Post Midle

Tags: Patients are welcome at the government hospital

Post Midle
Natyam ad