రోగులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలి

Date:15/07/2019

వనపర్తి ముచ్చట్లు:

గోపాల్ పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రంగులు వేయించడమే కాకుండా రోగులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిర్ణయించడం జరిగింది. సోమవారం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో డాక్టర్ మంజుల అధ్యక్షతన జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ శ్రీనివాసులు, జెడ్ పి టి సి భార్గవి, ఎంపీపీ సంధ్య, వైస్ ఎంపీపీ శేఖర్, డాక్టర్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రంగులు వేయించడమే కాకుండా ఆస్పత్రిలో వైరింగ్ చేయించి రోగులకు అవసరమయ్యే వాటర్
ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

 

 

 

 

ముఖ్యంగా రోగులు ఎటువంటి అసౌకర్యాల గురికాకుండా ఆస్పత్రిని అన్ని రకాలుగా తీర్చిదిద్దాలని కమిటీ నిర్ణయించింది. అనంతరం నూతనంగా ఎన్నికైన జెడ్పిటిసి భార్గవిని , ఎంపీపీ సంధ్యను మరియు వైస్ ఎంపీపీ శేఖర్ ను శాలువా కప్పి ఆస్పత్రి సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

వెంకన్నను  దర్శించుకున్న నరసింహన్

Tags: Patients should be provided with all kinds of facilities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *