Natyam ad

మే 23న శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో ప‌త్రపుష్ప‌యాగం

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో మే 23వ తేదీ ప‌త్ర‌పుష్పయాగం జ‌రుగ‌నుంది. ఇందుకోసం మే 22వ తేదీన సాయంత్రం అంకురార్పణ నిర్వ‌హిస్తారు.ఇందులో భాగంగా మే 23న ఉదయం 7.30 నుండి 9.30 గంటల వ‌ర‌కు సోమ‌స్కంద‌మూర్తికి స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. ఉద‌యం 10 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌త్రపుష్ప‌యాగ మ‌హోత్స‌వం జ‌రుగ‌నుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి ప‌లుర‌కాల పుష్పాలు, ప‌త్రాలతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు స్వామివారి తిరువీధి ఉత్స‌వం జ‌రుగ‌నుంది. గృహ‌స్తులు(ఇద్ద‌రు) రూ.200/- చెల్లించి ప‌త్రపుష్ప‌యాగంలో పాల్గొన‌వ‌చ్చు.ఈ ఆలయంలో మార్చి 1 నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జ‌రిగాయి. ఈ ఉత్స‌వాల్లో అర్చ‌క ప‌రిచార‌కులు, భ‌క్తుల వ‌ల్ల తెలియ‌క జ‌రిగిన పొర‌బాట్ల‌కు ప్రాయ‌శ్చిత్తంగా ప‌త్రపుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.

 

Post Midle

Tags: Patrapushpayagam at Sri Kapileshwaralayam on 23rd May

Post Midle