పుంగనూరులో దేశభక్తిని పెంపొందించుకోవాలి – న్యాయమూర్తి వాసుదేవరావు
పుంగనూరు ముచ్చట్లు:
ప్రజలు క్రమశిక్షణతో దేశభక్తిని పెంపొందించుకోవాలని , బాధ్యతగా జీవించడం అలవర్చుకోవాలని సీనియర్ సివిల్‌జడ్జి వాసుదేవరావు పిలుపునిచ్చారు. శనివారం అడిషినల్ జూనియర్ సివిల్‌జడ్జి సిందుతో కలసి మధ్యాహ్నం ఆజాదీకా అమృత్ మహ్గత్సవ్‌లో భాగంగా న్యాయవాదులు, విద్యార్థులతో కలసి ర్యాలీ నిర్వహించారు. న్యాయమూర్తి వాసుదేవరావు మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించడ ం ఆదర్శనీయమన్నారు. ప్రతి ఒక్కరు జాతీయజెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలాపించి, గౌరవ వందనం చేయడం అలవర్చుకోవలన్నారు. దీని ద్వారా ప్రజల్లో భక్తిబావం పెరిగి శాంతియుత జీవనం సాగించేందుకు వీలుందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్, న్యాయవాదులు వెంకట్రామయ్యశెట్టి, రమేష్, హరినాథరెడ్డి, అయూబ్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Patriotism should be developed in Punganur – Justice Vasudeva Rao
