మారుతున్న నేరాల అనుగుణంగా గస్తీ, ప్యాట్రోలింగ్లను పెంచాలి

–  పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీ చేసిన సైబరాబాద్ సీపీ స్టిఫెన్ రవీంద్ర

హైదరాబాద్  ముచ్చట్లు:

సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని బాలానగర్, జీడిమెట్ల, జగథ్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ పోలీసు స్టేషన్ల పరిసరాలను సందర్శించి పోలీసుస్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణపై లోతుగా పరిశీలించారు. విధుల్లో భాగంగా పోలీసులు మెయింటేన్ చేసే రిసెప్షన్, జీడీ ఎంట్రీ తదితర.. రికార్డును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. మారుతున్న నేరాల నమూనాకు అనుగుణంగా గస్తీ, ప్యాట్రోలింగ్లను పెంచాలన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాత నేరస్తులు, సస్పెక్ట్ లు, రౌడీ షీటర్లపై నిఘాను ఉంచాలన్నారు. పోలీస్ స్టేషన్లలో క్రైమ్ పాట్రాన్స్, ఫంక్షనల్ వర్టీకాల్స్, కోర్ట్ డ్యూటీ, రిసెప్షన్, బిసి/పెట్రోల్ మొబైల్, క్రైమ్ టీమ్స్, టెక్ టీమ్స్ పనితీరును పరిశీలించారు. గంజాయి సరఫరా పై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా చేపడుతుంటే సమాచారము అంధించినవెంటనే చర్యలు చేపట్టాలని, సైబర్ నేరాల విషయంలో ప్రభుత్వం చేస్తున్న సూచనలను పాటించాలని తెలియజేశారు. శాంతిభధ్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారం ప్రాధాన్యతగా విధులుండాలని ఆదేశించారు. పోలీసులు అంకితభావంతో విధులను నిర్వర్తించాలన్నారు. లా అండ్ ఆర్డర్, నేరాల నివారణ వ్యూహాలపై సీపీ సిబ్బందితో చర్చించారు. స్టేషన్ లోని సిబ్బంది, మహిళా పోలీస్ సిబ్బంది తో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావలన్నారు. ఏదైనా నేరం జరిగినప్పుడు సరైన సమాచారాన్ని, ఆధునికతను ఉపయోగించి నేరస్తులను గుర్తించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలనన్నారు. ఈ సందర్భంగా ఆయనతో బాలానగర్ డిసిపిసందీప్, బాలానగర్ ఏసిపి పురుషోత్తమ్, బాలానగర్ ఇన్ స్పెక్టర్ ఎం‌.డి. వహీదుద్దీన్, జీడిమెట్ల ఇన్ స్పెక్టర్ బాలరాజు, జగథ్గిరిగుట్ట ఇన్ స్పెక్టర్ సైదులు, డీ.ఐ లు, ఎస్.ఐ లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:Patrols and patrols should be increased in line with changing crime

Post Midle
Natyam ad