పవన్-కాపుల రహస్య సమావేశం

Pavan-kapula secret meeting

Pavan-kapula secret meeting

Date:15/09/2018

తిరుపతి ముచ్చట్లు:

పవన్-కాపుల రహస్య సమావేశంపై ఎట్టకేలకు స్పందించారు జర్నలిస్ట్ మూర్తి. (మహాటీవీకి ఆయన రాజీనామా చేశారు కాబట్టి ఇకపై మహామూర్తి అని వ్యవహరించలేం). అది రహస్య సమావేశమేనని, పవన్ డబ్బులు తీసుకుంటున్న సన్నివేశాన్ని తను కళ్లారా చూశానని అంటున్నారు. అలా తనపై జరిగిన ట్రోలింగ్ కు తిరుగులేని సమాధానం ఇచ్చారు.

“కాకతీయ హోటల్ లో జనసేన పార్టీ సమావేశం పెట్టింది. దానికి కాపువర్గానికి చెందిన ప్రముఖుల్ని మాత్రమే పిలిచారు. వాళ్ల నుంచి మాత్రమే ఫండ్స్ తీసుకున్నారు. అది సీక్రెట్ సమావేశమే. జనసేన పార్టీకి చెందిన కీలకమైన వ్యక్తులు నాకుచెబితే, కళ్లతోచూసి తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేనే మారువేషంలో ఆ సమావేశానికి వెళ్లాను.”

అన్ని కులాల్ని కలుపుకుంటూ వెళ్తామని చెప్పిన జనసేన, కేవలం కాపువర్గానికి చెందిన ప్రముఖుల్ని మాత్రమే పిలిచిందని అంటున్నారు మూర్తి. దానికి సంబంధించి ఓ వీడియోను కూడా ఆయన సోషల్ మీడియాలో బయటపెట్టారు. పారదర్శకంగా వ్యవహరించాల్సిన జనసేనపార్టీ.. చెక్కులు, డ్రాఫ్టుల రూపంలో కాకుండా నేరుగా డబ్బు కూడా తీసుకుందని ఆరోపించారు. ఇదంతా పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జరిగిందని, ఆ సమయంలో తను అక్కడే వేరే గెటప్ లో ఉన్నానంటున్నారు మూర్తి.

“అది సీక్రెట్ సమావేశం కాకపోతే మీడియాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు. అది సీక్రెట్ సమావేశం కాకపోతే జనసేన బోర్డు ఎందుకు పెట్టలేదు. అది సీక్రెట్ సమావేశం కాకపోతే పవన్ సొంత ఛానెల్ 99టీవీలో ఎందుకు ప్రసారం చేయలేదు. ఫొటోలు ఎందుకు బయటకు వదల్లేదు. అది కచ్చితంగా సీక్రెట్ సమావేశమే.”

ఇక మహాటీవీ నుంచి తనను తొలిగించారనే వార్తపై కూడా మూర్తి స్పందించారు. తనపై తీవ్రమైన ఒత్తిడి రావడంతోనే ఆ ఛానెల్ నుంచి బయటకు వచ్చేశానని చెప్పారు. తనది ఏ కులం అంటూ ఆరాలు తీయకుండా ఎవరి పని వాళ్లు చూసుకుంటే బెటరని హితబోధ చేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రముఖ కులాల్లో దేనికీ తను చెందనని స్పష్టంచేశారు.

ఇకనైనా తనపై ట్రోలింగ్ లు ఆపేసి ఎవరిపని వాళ్లు చూసుకుంటే మంచిదన్నారు. ఇకనైనా పవన్ కల్యాణ్ తన పార్టీని పారదర్శకంగా నడిపిస్తే చూడాలని ఉందన్నారు మూర్తి. మహాటీవీకి రాజీనామా చేసిన మూర్తి, త్వరలోనే ఎన్టీవీలో చేరే అవకాశం ఉంది.

ప్రధాని హోదాలో రాహుల్  వస్తారు : కేవీపీ

Tags:Pavan-kapula secret meeting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *