పవన్ వారికి టిక్కెట్లు ఇవ్వగలరా…

Date:15/03/2018
విజయవాడ ముచ్చట్లు:
‘ప్రభుత్వాలు అనుసరిస్తున్న దురన్యాయాల వలన విలపిస్తున్న వారిని, ఏడుస్తున్న వారిని, దుఃఖంలో ఉన్న వారిని… సమయానుకూలంగా వాడుకుని.. నీ పార్టీ ప్రచారానికి.. నువ్వేదో బాధితుల పక్షాన ఉన్నట్లుగా బిల్డప్ ఇవ్వడానికి.. వారిని ఒక ఎగ్జిబిట్స్ లాగా వాడుకోవడం కాదు పవన్ కల్యాణ్ గారూ… వారి విలాపాశ్రువులను మీ ప్రచారాస్త్రాలుగా వాడుకోవడం కాదు.. వారు తప్ప నాకింకెవ్వరూ వద్దు.. నా వెనక ఉన్నదెల్లా వాళ్లే.. సామాన్యులే.. అంటూ.. సభాజన రంజకంగా డైలాగులు వేయడం కాదు… మీకు అంతగా చిత్తశుద్ధి ఉంటే.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పుడు   మీ పార్టీలో మీ వెనుక ఉన్న ముఖ్య అతిథులుగా పరిచయం చేసిన వారిని… ఎన్నికల్లో నిలబటెట్టి ప్రజాప్రతినిధులుగా సభలోకి తీసుకురాగలరా..’’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.పవన్ కల్యాణ్ గుంటూరులో భారీస్థాయిలో తన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. పెట్టిన సభలో ఫాతిమా కాలేజీ బాధితులు, ఉద్దానం, తుందుర్రు బాధితులు వీరినందరినీ తన పార్టీ ముఖ్య అతిథులుగా కార్యక్రమానికి ఆహ్వానించినట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. మీ వెనుక బలాలు, బలగాలు ఉండొచ్చు.. కానీ నా వెనుక ఉన్నదంతా సామాన్యులు.. అంటూ సభారంజకంగా ప్రకటించారు. తన వెనుక సామాన్యులు ఉండడమే తన బలం అంటూ.. పవన్ కల్యాణ్ పదేపదే గొప్పలు చెప్పుకున్నారు. వారిని వేదిక మీదికి పిలిపించి.. పలానాపలానా బాధితులంటూ పరిచయం చేశారు.వారు ప్రభుత్వాల వలన బాధలు పడుతున్న వారు గనుక.. వారి ఏడుపులను ప్రచారానికి వాడుకోవడానికి వేదిక మీదికి పిలిపించడం అనే టెక్నిక్ బాగానే ఉంది. మరి పవన్ కల్యాణ్ వారి బాగు కోసం ఏం చేయబోతున్నారుపవన్ కూడా.. ముందు నన్ను సీఎం చేయండి.. ఆ తర్వాత నేను మిమ్మల్ని ఉద్ధరిస్తా అంటూ సెలవిస్తారా? లేదా, కనీసం ఆ బాధితులు తమ సమస్యలను, తమ గళాన్ని తాము వినిపించేందుకు వారికి ఎన్నికల్లో టికెట్టు ఇచ్చి ప్రోత్సహించగలరా? సమస్యలను అనుభవించిన వారే ఇతరుల సమస్యలను తెలుసుకోగలరు. అందరి సమస్యల పరిష్కారానికి పనిచేయగలరు అనే సిద్ధాంతం అనుసరించి.. ఆయన వారికి టికెట్లు ఇవ్వగలరా? వారి మీద సానుభూతి మొత్తం డ్రామానేనా? అని ప్రజల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ ఈ విషయంలోనూ తన చిత్తుశుద్ధి చాటుకోవాల్సి ఉంది.
Tags: Pawan can give tickets to …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *