పవన్ ఫ్యాన్స్ వర్సెస్ శ్రీ రెడ్డి 

Date:17/04/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా పోరాడుతోన్న నటి శ్రీరెడ్డి జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలపై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై మెగా కుటుంబం నుంచి తొలి స్పందన వచ్చింది. బాబాయ్‌పై శ్రీరెడ్డి వ్యాఖ్యలకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చాడు. నేరుగా శ్రీరెడ్డి పేరు ప్రస్తావించకుండా ఫేస్‌బుక్‌లో వరుణ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ‘నిన్ను విమర్శించి, తక్కువ చేసి చూపించాలని ప్రయత్నించే నీచ మనస్కుల గురించి పట్టించుకోనవసరం లేదు. అలాంటి వారు వాళ్ల బలహీనతలను తెలుసుకోలేరు. తమ లోపాల్ని తెలుసుకోవడం కన్నా ఎదుటి వాళ్లను తప్పుడు వ్యక్తులుగా చూపించడానికి ఎక్కువ ఉత్సాహం ప్రదర్శిస్తారు’ అంటూ వరుణ్ తేజ్ పోస్టు పెట్టారు. దీనికి మెగా అభిమానుల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది.అన్యాయం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలి గానీ, మీడియాకు ఎక్కితే పబ్లిసిటీ వస్తుంది తప్ప, ప్రయోజనం ఉండదంటూ తన పోరాటంపై పవన్ చేసిన వ్యాఖ్యలను శ్రీరెడ్డి ఖండించిన విషయం తెలిసిందే. అలాగే సోమవారం నాడు బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన శ్రీరెడ్డి.. ‘పవన్ కళ్యాణ్.. నిన్ను అన్నా అని అన్నందుకు చెప్పుతో కొట్టుకోవాలంటూ అన్నంత పని చేసింది. తన చెప్పు తీసుకునే మీడియా ముందే కొట్టుకుంది. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలి తప్ప.. పబ్లిసిటీ కోసం మీడియాకెక్కితే లాభం లేదన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై విరుచుకుపడింది.మహిళల పోరాటాన్ని ఆయన చిన్నచూపు చూస్తున్నారని విమర్శించింది. పవన్ కళ్యాణ్.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నావ్.. అసలు నీకు మహిళలంటే గౌరవం ఉందా? అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్‌లకు వెళ్లాలా? నువ్ చెప్పాలి మరి నాకు స్టేషన్‌కు వెళ్లాలని. అసలు నిన్ను అన్నా అని అన్నందుకు ఏంచేస్తానో చూడండంటూ మీడియా ముందే చెప్పుతీసుకుని చెంపలపై వాయించుకుంది శ్రీరెడ్డి. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా గళమెత్తిన శ్రీశక్తి అలియాస్ శ్రీరెడ్డిపై పవన్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేస్తూ, ఆయన తల్లి పేరు ప్రస్తావించడంపై ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. దీనిపై శ్రీరెడ్డికి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన పోస్ట్‌లు పెడుతూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ పోస్టులపై స్పందించిన శ్రీరెడ్డి.. తన పిల్లల్ని కూడా బెదిరించారని వాపోయింది. పవన్ తల్లిని క్షమాపణ కోరుతున్నానని, దురుద్దేశంతో ఆమెపై వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. తన పిల్లలను ఈ వివాదంలోకి లాగుతున్నారనే బాధతోనే వ్యాఖ్యలు చేశాను తప్పా, తన గురించి ఎంత చెడుగా మాట్లాడినా పట్టించుకోబోనని అన్నారు. అంతేకాదు పవన్ కల్యాణ్ అంటే అసలు లెక్క లేదని వ్యాఖ్యానించింది.సాటి ఆడ మనిషి ఒక తల్లిని అగౌరవ పరచటమే కాకుండా నిన్ను బట్టలు ఇప్పుకొని అగౌరవ పరచుకొని ఇతరులను అనటం సమంజసమా శ్రీరెడ్డి. నీవు బూతులు మాట్లాడుతే తప్పు లేదు ఇతరులు అదేవిధంగా మాట్లాడుతే …దీనిపై అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఓ వీడియోను పోస్టు చేసిన శ్రీరెడ్డి, ఓ ప్రజానాయకుడైన పవన్, తమ సమస్యపై సరిగ్గా స్పందించలేదని ఆరోపించారు. ఆయన గురించి మీడియా ముందు ప్రస్తావించిన అమ్మాయిలను తీవ్రంగా భయపెడుతున్నారని, ఎన్నాళ్లు మా నోళ్లు నొక్కేస్తారని ప్రశ్నించారు. తమ సమావేశాన్ని అత్యంత ఘోరంగా అభివర్ణించారని దుయ్యబట్టారు.కేవలం పవన్ కల్యాణ్‌కు మాత్రమే తల్లి ఉన్నారా? అని ఆమె ప్రశ్నించారు. కొంతమంది ఎవరి పక్కలో పడుకోకుండానే క్యారెక్టర్లు తెచ్చుకున్నారని, వారిని కూడా ఈ రొచ్చులోకి పవన్ ఫ్యాన్స్ లాగుతున్నారని ఆరోపించారు. తమ బాధను అర్థం చేసుకోవాలని, నిజం చెబుతుంటే నోరు నొక్కే ప్రయత్నం చేయవద్దని కోరింది. తన పోరాటాన్ని ఆపబోనని, ఈ పోరాటంలో తాము సమిధలమైనా లెక్కచేయబోమని హెచ్చరించింది.‘ఒక్క మాట పవన్ అమ్మ గార్ని అంటే ఇన్ని భూతులుతో మెసేజ్‌లు పెడుతున్నారు…. ఇదేనా ఆడవారికి మీరు ఇచ్చే గౌరవం … మేము పోరాడేది కూడా ఆ గౌరవం కోసమే…. వాళ్ల అమ్మ కేనా గౌరవం..? మాకు లేదా…? ఇంతమంది అమ్మాయిలం రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తుంటే, పవన్ గారు మీరే ముందుకు వచ్చి న్యాయం చేయమని ఇండస్ట్రీ పెద్దలని కూర్చోబెట్టి ప్రశ్నించవచ్చుగా….? లేదా మీ అభిమానులు మా ఆడవాళ్లని తిడుతూ పెట్టే మెసేజ్‌లు చూడవచ్చుగా…?’ అని నిలదీసింది. ‘దయచేసి మమ్మల్ని తిట్టే ఈ మెసేజ్‌లని పవన్ గారు చదవండి…. వీడియో కింద ఉన్న ఏ మెసేజ్ డిలీట్ చెయ్యట్లేదు… మీ ఫాన్స్ చిల్లర చేష్టలు అర్ధమవుతాయి…. మీ నాయకత్వానికి మీ ఫాన్స్ ఎంత మచ్చ తీసుకొస్తున్నారో దయచేసి చూసుకోండి…! అమ్మాయిలు అందరూ గౌరవానికి అర్హులు… వారిని తక్కువ చేయకండి.. మహిళల ఓట్లు కూడా మీకు ముఖ్యమే’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.
Tags: Pawan Fans vs Sri Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *